395 రోజుల వాలిడిటీతో BSNL రూ.797 కొత్త వోచర్ ప్లాన్!! ప్రైవేట్ టెల్కోలకు దీటుగా

|

భారత ప్రభుత్వ ఆద్వర్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో తన వినియోగదారుల కోసం కొత్తగా ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.797 ధర వద్ద లభించే ఈ ప్లాన్ అధిక చెల్లుబాటును ఇష్టపడే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండేలా ఉద్దేశించబడింది. ఈ వోచర్ ప్లాన్ తో అందించే అన్ని రకాల ప్రయోజనాలు మొదటి 60 రోజులు మాత్రమే ఉంటాయి. ఆపై వినియోగదారులు వారి కోరిక మేరకు టాక్‌టైమ్ ప్యాక్‌లు లేదా డేటా ప్యాక్‌లను జోడించవచ్చు. ఈ ప్లాన్ తో BSNL కనెక్షన్‌ని యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లో సెకండరీ సిమ్‌గా ఉంచాలనుకునే వారికి ఆదర్శవంతమైన ఎంపికగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL రూ.797 వోచర్ ప్లాన్ వివరాలు

BSNL రూ.797 వోచర్ ప్లాన్ వివరాలు

BSNL టెల్కో రూ.797 ధర వద్ద అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాలలో మొదటి 60 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలు అందించబడుతుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbpsకి తగ్గించబడుతుంది. 60 రోజుల తర్వాత ప్రయోజనాల గడువు ముగుస్తుంది కానీ SIM కార్డ్ సంవత్సరం పొడవునా యాక్టీవ్ దశలో ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క సాధారణ వాలిడిటీ 395 రోజులు. అయితే జూన్ 12, 2022 లోపు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు BSNL ఈ ప్లాన్‌తో 30 రోజుల అదనపు చెల్లుబాటును కూడా అందిస్తుంది.

BSNL

BSNL రూ.797 వోచర్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారు 60 రోజుల తరువాత వారి సిమ్ యాక్టీవ్ లో ఉండడంతో ఇన్ కమింగ్ కాల్ కోసం చింతించవలసిన అవసరం లేదు. టాక్‌టైమ్ వోచర్‌లు మరియు డేటా వోచర్‌లు పుష్కలంగా ఉన్నందున వీటిని మీకు అవసరమైనప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు. BSNL అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒక మంచి విషయం ఏమిటంటే అవి చాలా సరసమైన ధరలో లభిస్తాయి. అయినప్పటికీ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్‌లతో వినియోగదారులు పొందే వేగవంతమైన 4G నెట్‌వర్క్‌లు వారికి మద్దతు ఇవ్వవు.

ప్రైవేట్ టెల్కోలు
 

ప్రైవేట్ టెల్కోలు ఏవీ కూడా ఇటువంటి ప్లాన్ ను అందించడం లేదు. BSNL సిమ్ ను సెకండరీగా ఎంచుకునే వ్యక్తులకు ఇది గొప్పదిగా ఉంటుంది. BSNL ఆగస్ట్ 15, 2022 నాటికి 4G మరియు 5G నెట్‌వర్క్‌లను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇదే తేదీన ప్రైవేట్ టెల్కోలు 5Gని కూడా ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. BSNL భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతానికి 4G పరికరాల కోసం టెల్కో ఇంకా ఆర్డర్లు ఇవ్వలేదు.

BSNL రూ.329 కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.329 కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL భారత్ ఫైబర్ లో కొత్తగా రూ.329 ధర వద్ద లభించే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు 20 Mbps వేగంతో ఇంటర్నెట్ ను బ్రోస్ చేయడానికి వీలును కల్పిస్తుంది. దీనితో పాటు వారు 1000GB లేదా 1TB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని కూడా ఉచితంగా పొందుతారు. BSNL ఈ ప్లాన్‌తో మొదటి నెల బిల్లుపై 90% తగ్గింపును కూడా ఇస్తున్నట్లు వాగ్దానం చేస్తోంది. కంపెనీ అందిస్తున్న రూ.449 ప్లాన్‌కి ఇది చాలా తేడా లేదు. కానీ ఎవరైనా తమ యొక్క స్వంత ఉపయోగం కోసం ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని పొందాలని చూస్తున్న ఏ వ్యక్తికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రాథమిక ఇంటర్నెట్ కార్యకలాపాలు చేయడానికి 1000GB డేటా సరిపోతుంది.

BSNL కొత్త ప్లాన్‌ల ప్రయోజనాలు

BSNL కొత్త ప్లాన్‌ల ప్రయోజనాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లలో రూ.184 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ 1GB రోజువారీ డేటా, 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలతో లభిస్తాయి. అలాగే రూ.185 మరియు రూ.186 ధరల వద్ద లభించే ప్లాన్‌లు కూడా 1GB రోజువారీ డేటా మరియు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్‌లు కూడా 28 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత మూడు ప్లాన్‌లతో వినియోగదారు ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి పడిపోతుంది. అలాగే రూ.185 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు "M/S ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ మరియు BSNL ట్యూన్స్ ద్వారా ప్రోగ్రెసివ్ వెబ్ APP (PWA)లో సవాళ్ల బండ్లింగ్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌ను పొందుతారు. అలాగే రూ.186 ప్లాన్ హార్డీ గేమ్‌లు మరియు BSNL ట్యూన్స్ యొక్క అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Launches Rs.797 New Voucher Plan With 2GB Daily Data and 395 Days Validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X