Home
News

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌.. తక్కువ ధరలో ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీ.. వీరికి బాగా ఉపయోగపడుతుంది..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గత సంవత్సరం జులై నుంచి కాస్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. గతానికి కంటే భిన్నంగా గత సంవత్సరం కొత్త యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. సుమారు 50 లక్షల మంది కొత్తగా చేరారు. దీంతోపాటు ఏకంగా 17 సంవత్సరాల తర్వాత BSNL లాభాల్లోకి వచ్చింది. 2024-25 సంవత్సరంలో సుమారు రూ.260 కోట్ల లాభాలు వచ్చినట్లు తెలిపింది.

ప్రస్తుతం పాజిటివ్‌గా ఉన్న పరిస్థితులను అందిపుచ్చుకొనేందుకు BSNL అనేక ప్రయత్నాలు చేస్తోంది. 4G నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టవర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు టవర్ల వద్ద విద్యుత్‌ అంతరాయాల సమయాల్లో సిగ్నల్‌ ఇబ్బందులు లేకుండా బ్యాటరీల ఏర్పాటు సహా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తోంది.

BSNL launches rs439 Prepaid recharge plan

దీంతోపాటు ఇటీవల కొత్తగా అనేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. న్యూయర్‌ సందర్భంగా కొత్త ప్లాన్‌లను లాంచ్ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ అనంతరం యూజర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, డేటా కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొస్తోంది.

90 రోజుల వ్యాలిడిటీ :
తాజాగా BSNL రూ.439 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ను (BSNL Rs439 Prepaid Recharge Plan) లాంచ్‌ చేసింది. సోషల్‌ మీడియా ఆధారంగా వివరాలు వెల్లడించింది. ఈ ప్లాన్‌లో భాగంగా లోకల్‌, STD అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.

వీరికి బాగా ఉపయోగం! :
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) గతంలో జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా కేవలం కాలింగ్‌, SMS లతో ఈ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా ప్రయోజనాలు అందించడం లేదు. కేవలం కాలింగ్ కోసం ఫోన్‌ వినియోగించే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని రీఛార్జ్ ప్లాన్‌లు :
దీంతోపాటు ఈ నెల 16 వ తేదీన BSNL మరో రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.347 ప్లాన్‌లో (BSNL Rs347 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిడెట్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయం ఉందిస్తోంది. దీంతోపాటు రోజువారీ 100 SMS వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగం రోజువారీ 2GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 104GB డేటాను వినియోగించుకోవచ్చు. తక్కువ ధరలో రోజువారీ ఎక్కువ డేటా అవసరాలు ఉన్నవారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

డేటా మాత్రమే కావాలా? :
దీంతోపాటు కాలింగ్, SMS లు అవసరం లేకుండా కేవలం డేటా అవసరం మాత్రమే ఉన్న వారి కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.411 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి రోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజుల వరకు ఉంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్‌, SMS ప్రయోజనాలను అందించడం లేదు.

90GB డేటా సహా :
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.249 రీఛార్జ్ ప్లాన్ ఇటీవలే విడుదల అయింది. ఈ ప్లాన్ లో భాగంగా రోజువారీ 2GB డేటా ను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ (BSNL Rs249 Recharge Plan) వ్యాలిడిటీ 45 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 90GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటాను వినియోగించుకున్నాక.. డేటా స్పీడ్‌ 40kbps గా ఉండనుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL launches rs439 Prepaid recharge plan with 90 days validity check full benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X