కేవలం కాలింగ్ కోసమే ఫోన్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ మీకోసమే..!
BSNL ఇటీవల కాలంలో వరుసగా కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇతర టెలికాం సంస్థల ధరలతో పోలిస్తే.. తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తోంది. గత సంవత్సరం జులై నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లోకి భారీ సంఖ్యలో యూజర్లు చేరుతున్నారు. ఇతర నెట్‌వర్క్‌ల ధరల పెంపు కారణంగా.. తక్కువ ధరకే సేవలు అందిస్తున్న BSNL వైపు మొగ్గు చూపుతున్నారు.
BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ :
తాజాగా BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.439 రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL RS439 Recharge Plan) భాగంగా ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ చేసుకోవచ్చు. మరియు 300 SMS లను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటాను అందించడం లేదు.

వీరికి చాలా ఉపయోగం! :
ఫీచర్ ఫోన్‌లు ఉపయోగిస్తున్న యూజర్లు, కేవలం కాలింగ్ అవసరాలు మాత్రమే ఉన్న యూజర్లకు ఈ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు BSNL ను రెండో సిమ్ కార్డుగా ఉపయోగించుకొనేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. మరియు తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
ఇటీవల ట్రాయ్ ఏం చెప్పిందంటే? :
అయితే ఇటీవలే టెలికాం రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం సంస్థలకు కీలక సూచనలు చేసింది. డేటా ప్రయోజనాలు లేకుండా కేవలం కాలింగ్, SMS కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. వినియోగదారులు ఏం వినియోగిస్తున్నారో వాటికే నగదు చెల్లించే అవకాశం కల్పించాలని తెలిపింది.
60 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్ :
దీంతోపాటు ఇటీవల BSNL ఇటీవల కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.277 రీఛార్జ్ ప్లాన్ కేవలం ఈ నెల 16 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంటుంది.
దీంతోపాటు రూ.215 మరియు రూ.628 రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. BSNL రూ.628 రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL Rs628 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. BSNL ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమన్, అస్ట్రోసెల్, లైస్టన్ పాడ్‌కాస్ట్, జింగ్ మ్యూజిక్ ను కూడా వినియోగించుకోవచ్చు.
BSNL రూ.215 రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL Rs215 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 60 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.


Click it and Unblock the Notifications








