కొత్త ప్లాన్‌తో దూసుకొచ్చిన BSNL, పాత ప్లాన్లలో పలు మార్పులు

టెలికం రంగంలో పోటీ నెలకొని ఉంది. ప్రయివేటు ప్రొవైడర్లను తట్టుకొనేందుకు గత కొన్నాళ్లుగా బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్ తీసుకు వస్తోంది. ఉన్నవారిని కాపాడుకుంటూ...

|

టెలికం రంగంలో పోటీ నెలకొని ఉంది. ప్రయివేటు ప్రొవైడర్లను తట్టుకొనేందుకు గత కొన్నాళ్లుగా బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్ తీసుకు వస్తోంది. ఉన్నవారిని కాపాడుకుంటూ, కొత్త యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు దానితో పోటీ పడుతున్న ఎయిర్టెల్ కి చెక్ పెట్టే దిశగా తన అడుగులను ఫాస్ట్ గా అడుగులను వేస్తోంది.

కొత్త ప్లాన్‌తో దూసుకొచ్చిన BSNL, పాత ప్లాన్లలో పలు మార్పులు

ఇందులో భాగంగానే కంపెనీ మరో కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని పేరు రూ.56 ప్లాన్. అలాగే కంపెనీ మరోవైపు రూ.46 ప్లాన్‌ను వెనక్కు తీసుకోనుంది.

రూ.56 ప్లాన్‌

రూ.56 ప్లాన్‌

ఈ ప్లాన్ మే 13 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. యూజర్లు ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది. అయితే కాల్ ఫెసిలిటీ, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయో లేవో అనే దానిపై సమాచారం లేదు. అలాగే ఈ ప్లాన్ కేవలం ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ.46 ప్లాన్‌

రూ.46 ప్లాన్‌

మరోవైపు కంపెనీ రూ.46 ప్లాన్‌ను వెనక్కు తీసుకోనుంది. అలాగే బీఎస్ఎన్ఎల్ తన రూ.47 ప్లాన్, రూ.198 ప్లాన్లను సవరించింది. ఇప్పుడు రూ.47 ప్లాన్‌లో అఅపరిమిత కాల్స్‌తోపాటు 1 జీబీ డేటా పొందొచ్చు. అయితే ప్లాన్ వాలిడిటీ 111 రోజుల నుంచి 9 రోజులకు తగ్గింది.

రూ.198 ప్లాన్‌

రూ.198 ప్లాన్‌

రూ.198 ప్లాన్‌లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదివరకు ఇది 28 రోజుల ప్లాన్. అలాగే రోజుకు 1.5 జీబీ డేటా ఇచ్చేవారు. ఇప్పుడు 54 రోజులకు పెంచారు. అలాగే రోజుకు 2 జీబీ అలాట్ చేస్తారు.

 రెండు న్యూ రీచార్జ్ ప్లాన్స్

రెండు న్యూ రీచార్జ్ ప్లాన్స్

అంతకుముందు, ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా రెండు న్యూ రీచార్జ్ ప్లాన్స్ తీసుకు వచ్చింది. రూ.199 రీచార్జ్ ప్యాక్‌కు 28 రోజుల వాలిడిటీ ఇచ్చింది. ఈ ప్లాన్‌తో యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు (రోజుకు) ఇచ్చింది. రోజుకు 1 జీబీ డేటా ఆఫర్ చేసింది. దీంతో పోలిస్తే ఇప్పుడు తీసుకువచ్చిన రూ.198 ప్లాన్ బెట్టర్‌గా భావిస్తున్నారు.

ప్లాన్ రూ.499

ప్లాన్ రూ.499

ఐపీఎల్ కోసం బీఎస్ఎన్ఎల్ తీసుకు వచ్చిన రెండో ప్లాన్ రూ.499. ఇది 90 రోజుల వాలిడిటీ ఉంది. అంటే మూడు నెలలు కాలం. బెనిఫిట్స్ మాత్రం తొలి స్కీంలాగే ఉంటాయి. రోజుకు 1 జీబీ డాటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్డీటీ, రోమింగ్ కాల్స్ ఉంటాయి.

వచ్చే నెల 6వ తేదీ వరకు
ఇదిలా ఉండగా, బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వచ్చే నెల 6వ తేదీ వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ఫ్యాన్సీ నెంబర్లపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్ ప్రకటించింది. 786తో ముగిసే నెంబర్లకు రూ.600కు బదులు రూ.300, 786బీతో ముగిసే నంబర్లకు రూ.100కు బదులు రూ.50 చెల్లించి తీసుకోవచ్చు.

 

    ఆసక్తి ఉన్నవారు

ఆసక్తి ఉన్నవారు

ఆసక్తి ఉన్నవారు cymn.bsnl.co.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఫ్యాన్సీ నంబర్‌ను ఎంపిక చేసుకోవచ్చని, 786తో ముగిసే నంబర్లకు రూ.600కు బదులుగా రూ.300, 786bతో ముగిసే నంబర్లకు రూ.100కు బదులుగా రూ.50 చెల్లించి నేరుగా తీసుకోవచ్చన్నారు

Best Mobiles in India

English summary
BSNL Launches New Rs 56 Data STV With 1.5GB Daily Benefit for 14 Days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X