BSNL నుంచి ధర రూ.58, రూ.59తో రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.58 మరియు రూ.59 ధరలతో రెండు ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లలో ఒకటి డేటా వోచర్, మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్‌గా ఉంది. ఈ రెండు ప్లాన్‌లలోనూ డేటా సదుపాయం ఉంటుంది.
BSNL రూ.58 ప్లాన్ : ఇది డేటా వోచర్ ప్లాన్. దీని వ్యాలిడిటీ 7 రోజులపాటు ఉంటుంది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకొనేందుకు యూజర్ యాక్టివ్ బేసిక్ ప్లాన్‌ను కలిగి ఉండాలి. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. అనంతరం 40kbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.59 ప్లాన్ : ఇది వ్యాలిడిటీ ప్లాన్‌గా ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం సహా రోజుకు 1GB డేటాను పొందవచ్చు. అయితే ఎటువంటి SMS లు లభించవు. ఈ రెండు ప్లాన్‌లు (BSNL New Prepaid Plans 2024) ప్రస్తుతం అందుబాటులోకి ఉన్నాయి.
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు..! : BSNL వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 4G సర్వీసులు (BSNL 4G Services) ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్బర్ విధానంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనుంది.

గత సంవత్సరం జులైలో పంజాబ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ తన 4G నెట్‌వర్క్ ను ప్రారంభించింది. ప్రముఖ ఐటీ సంస్థ TCS మరియు భారత ప్రభుత్వం టెలికాం పరిశోధన సంస్థ C-DoT ల కన్సార్షియం రూపొందించిన టెక్నాలజీతో పంజాబ్‌లో 4G సర్వీసులను BSNL ప్రారంభించింది. ఫలితంగా అక్కడ సుమారు 8 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది.
పరీక్షల దశలో 700- 2100 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో 4G నెట్‌వర్క్‌తో 40- 45Mbps డేటా వేగాన్ని రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే ఈ కన్సార్షియం తయారుచేసిన క్లిష్టమైన టెక్నాలజీ పూర్తి స్థాయిలో నిరూపించుకొనేందుకు (Stabilize) 12 నెలల సమయం పడుతుండగా.. కేవలం 10 నెలల్లోనే స్టెబిలైజ్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి 4G సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని BSNL కు చెందిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు.
TCS, తేజస్ నెట్‌వర్క్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ ITI కు 4G నెట్‌వర్క్ విస్తరణ కోసం సుమారు రూ.19 వేల కోట్ల ఆర్డర్‌లను అందించింది. ఈ ఆత్మనిర్బర్ విధానంలో రూపొందిన ఈ 4G టెక్నాలజీని సులభంగా 5G అప్‌గ్రేడ్ అయ్యేలా రూపొందించారు. దీంతోపాటు 4G మరియు 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటుచేసేందుకు సంస్థ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా BSNL ఇప్పటికే 9000 టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఇందులో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, యూపీ వెస్ట్ వంటి సర్కిల్‌లలో సుమారు 6000 టవర్లు యాక్టివ్‌గా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత 4-5 సంవత్సరాల నుంచే 4G సిమ్ కార్డులను విక్రయిస్తోంది. అయితే ఇప్పటికీ పాత సిమ్ కార్డులను వినియోగిస్తున్నట్లయితే మెరుగైన సర్వీసుల కోసం అప్‌గ్రేడ్ కావాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








