సిల్వర్ జూబ్లీ రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన BSNL.. పూర్తి వివరాలు..!
BSNL ఇటీవల కాలంలో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. అనంతరం వివిధ ప్లాన్‌లు, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తొలుత ఢిల్లీలో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవలే రూ.251 రీఛార్జ్ ప్లాన్ ను ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను అందిస్తుంది. దీంతోపాటు మొత్తంగా 100GB డేటాను కూడా అందిస్తోంది. స్టూడెంట్ ప్లాన్ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

సిల్వర్ జూబ్లీ రీఛార్జ్ ప్లాన్ :
అయితే తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ మరో రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సూపర్ జూబ్లీ ప్లాన్ పేరుతో (BSNL Silver Jubilee Recharge Plan) ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.225 ధరతో కూడిన BSNL సూపర్ జూబ్లీ ప్లాన్‌లో (BSNL Rs225 Recharge Plan) అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్‌ను అందిస్తోంది.
దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లు సహా వివిధ ఆఫర్ల ద్వారా యూజర్లను ఆకట్టుకోవాలని BSNL భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* BSNL ఇటీవలే అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో 4G నెట్‌వర్క్ కోసం సుమారు లక్ష టవర్లను ఏర్పాటు చేయగా.. ఢిల్లీకి సమీపంలో మరిన్ని కొత్త టవర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తొలుత ఢిల్లీలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవలే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనేక ప్లాన్‌ల ప్రయోజనాల్లో కోత విధించింది.
* గతంలో రూ.147 రీఛార్జ్ ప్లాన్‌లో 10GB డేటాను వినియోగించుకొనే వీలుండేది. ప్రస్తుతం 5GB డేటాను మాత్రమే అందిస్తోంది. రూ.197 రీఛార్జ్ ప్లాన్‌లో 54 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 48 రోజుల వ్యాలిడిటీతో 300 నిమిషాల కాలింగ్, 100 SMSలు, మొత్తంగా 4GB డేటాను అందిస్తోంది.
అదే రూ.319 రీఛార్జ్ ప్లాన్‌లో 65 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 60 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 300 SMS, 10GB డేటాను అందిస్తోంది. BSNL రూ.439 రీఛార్జ్ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 80 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 300 SMS లను మాత్రమే అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.599 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 70 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు, రోజువారీ 3GB డేటాను అందిస్తోంది. దీంతోపాటు రూ.897 రీఛార్జ్ ప్లాన్, రూ.1499 రీఛార్జ్ ప్లాన్‌లోనూ మార్పులు చేసింది.


Click it and Unblock the Notifications








