BSNL 5G కోసం స్పెక్ట్రమ్‌లో భారీ కేటాయంపు?? 2023 లో అందుబాటులోకి...

|

ఇండియాలోని టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి తన సేవలతో ఎంతో మందిని ఆకట్టుకున్నది. తరువాత ప్రైవేట్ టెలికాం సంస్థల జోరుతో కొద్దిగా వెనుకబడినప్పటికీ కూడా తనని తాను అప్ డేట్ చేసుకుంటూ ఇతర టెలికాం సంస్థలకు పోటీని ఇవ్వనున్నది. దేశంలో ఇంకా 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించని ఈ ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ BSNL ఇప్పటికే 5G సేవలను ప్రారంభించేందుకు తన యొక్క ప్రయత్నాలను ప్రారంభించింది.

DoT

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి వచ్చిన నివేదిక ప్రకారం 5G సేవల కోసం మిడ్-బ్యాండ్ (3300-3670 MHz) స్పెక్ట్రమ్‌లో 70 MHz స్పెక్ట్రమ్ రిజర్వేషన్‌ను BSNL కంపెనీ కోరింది. BSNL వేగవంతమైన 4G ఆపై 5G రోల్‌అవుట్ నుండి ఎంతో ప్రయోజనం పొందడం కోసం చాలా పనులు సకాలంలో జరగవలసిన అవసరం ఎంతో ఉంది. BSNL 5G సర్వీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

NSA టెక్నాలజీతో BSNL 5G సర్వీస్

NSA టెక్నాలజీతో BSNL 5G సర్వీస్

BSNL టెలికాం సంస్థ తన యొక్క 5G సర్వీసులను NSA (నాన్-స్టాండలోన్) నెట్‌వర్క్‌ల విడుదలతో ప్రారంభించనున్నది. బేస్ 4G కోర్ నెట్‌వర్క్‌ నిర్మాణంతో దీనికి నాంది పలకవచ్చు. 5G NSA BSNL కోసం తక్కువ బడ్జెట్ ధరలోనే స్నేహపూర్వకంగా లభిస్తుంది. అయితే 5G SAకి కోసం పూర్తి స్థాయిలో కొత్త వ్యవస్థను సెటప్ చేయవలసి ఉంటుంది. దీని కోసం BSNL వద్ద తగినంత డబ్బు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇంతకుముందు గల స్వదేశీ పరికరాలు మరియు టెక్నాలజీను ఉపయోగించి బిఎస్‌ఎన్‌ఎల్ 5G పై పని చేస్తున్నట్లు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) అధికారి తెలిపారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో 5G నెట్‌వర్క్‌లను ఆశించవచ్చు.

2023లో BSNL 5G నెట్‌వర్క్‌ లాంచ్

2023లో BSNL 5G నెట్‌వర్క్‌ లాంచ్

ఇప్పటివరకు జరిగిన అన్ని పరిణామాల దృష్ట్యా చూసుకుంటే కనుక BSNL టెలికాం సంస్థ 2023 సంవత్సరంలో 5Gని లాంచ్ చేయబోతున్నట్లు నివేదించబడింది. అయితే 2023లోనే లాంచ్ జరగాలనుకుంటే కనుక అది నిజంగా టెల్కోకి మంచి విషయమే. 4G ఆలస్యం కావడంతో ఈ టెల్కో ప్రభుత్వం సాయంతో త్వరగా 5G నెట్‌వర్క్‌ లను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాయి. వినియోగదారులకు తాజా తరం కనెక్టివిటీ సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని BSNL టెల్కో 2022 చివర మరియు 2023 ప్రారంభంలో మరిన్ని ఎక్కువ 4G సైట్‌లను విడుదల చేయడమే కాకుండా వాటిలో ఎక్కువగా 5G సైట్‌లుగా వేగంగా అప్‌గ్రేడ్ చేసే ఆలోచనలో ఉంది.

5G నెట్‌వర్క్‌ కోసం BSNL 70 MHz స్పెక్ట్రమ్ అభ్యర్థన

5G నెట్‌వర్క్‌ కోసం BSNL 70 MHz స్పెక్ట్రమ్ అభ్యర్థన

ఆన్‌లైన్‌ నుంచి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం BSNL టెల్కో తన యొక్క 5G నెట్‌వర్క్‌ విస్తరణ కోసం కోరిన 70 MHz స్పెక్ట్రమ్ కి బదులుగా మిడ్-బ్యాండ్‌లో 40 MHz స్పెక్ట్రమ్‌ను మాత్రమే అందుకోనున్నట్లు సమాచారం. DCC (డిజిటల్ కమ్యూనికేషన్స్ కమీషన్) సిఫార్సులను DoT అనుసరిస్తుంది. 3300-3670 MHz బ్యాండ్‌లో 70 MHz ఎయిర్‌వేవ్‌లను రిజర్వ్ చేయడం వల్ల ప్రైవేట్ టెల్కోలకు 5G ఎయిర్‌వేవ్‌ల కొరత ఏర్పడుతుందని టెలికాం విభాగం భావించింది.

Best Mobiles in India

English summary
BSNL Launching 5G Network in 2023 With NSA Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X