BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు రూ.1200 డిస్కౌంట్ పొందే సువర్ణ అవకాశం!! ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

|

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో తన యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో వినియోగదారులకు ఉచితంగా రూ.1200 విలువ గల ప్రయోజనాలను అందిస్తోంది. భారతదేశంలోని ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆర్మ్‌లో 'భారత్ ఫైబర్' పేరుతో విజయవంతంగా ప్రభుత్వ టెల్కో రన్ చేస్తున్నది. BSNL భారత్ ఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు నేరుగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ వంటి వాటితో గట్టిగా పోటీపడుతున్నాయి.

BSNL భారత్ ఫైబర్

BSNL భారత్ ఫైబర్ యొక్క వ్యాపారానికి ఊతం ఇవ్వడానికి మరియు కొత్త వినియోగదారులను ఆకర్షించడానిక BSNL టెల్కో ఇప్పటికే కలిగిఉన్న ల్యాండ్‌లైన్/DSL బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఫైబర్ సేవలకు మారితే వారికి రూ.1200 విలువ గల ప్రయోజనాలను ఉచితంగా అందించనున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL ప్రతి నెలా బిల్లుపై రూ.200 తగ్గింపు

BSNL ప్రతి నెలా బిల్లుపై రూ.200 తగ్గింపు

BSNL యొక్క DSL/ల్యాండ్‌లైన్ సేవలను ఇప్పటికే కలిగిఉన్న వినియోగదారులు BSNL అందించే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మారితే కనుక అటువంటి వినియోగదారులకు ఆరు నెలల వరకు ఒక్కో బిల్లుపై రూ.200 వరకు తగ్గింపును అందిస్తోంది. అంటే వారు మొత్తం ఆరు నెలల్లో రూ.1200 వరకు తగ్గింపును అందుకుంటారు. టెల్కోలో ఎంచుకునే ప్రతి ప్లాన్‌పై ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

FTTH
 

రూ.1200 తగ్గింపును పొందే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. FTTH (ఫైబర్-టు-ది-హోమ్) సేవలు నేడు దేశం మొత్తం మీద మెరుగ్గా ఉన్నాయి. ఈ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తక్కువ ఖర్చుతో లభించడమే కాకుండా వినియోగదారుల కోసం ఎక్కువ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. BSNL ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కూడా కలిగి ఉంది.

DSL/ల్యాండ్‌లైన్

BSNL యొక్క భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ను ఎంచుకునే వినియోగదారులు 30 Mbps నుండి 300 Mbps వేగంతో అందించే ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. 300 Mbps కంటే ఎక్కువ వేగంతో అందించే ప్లాన్‌లు ప్రభుత్వ టెలికాం కంపెనీ కలిగి లేవు. కస్టమర్‌లు తమ సమీపంలోని BSNL కార్యాలయానికి లేదా కార్యాలయానికి ఫోన్ కాల్ ద్వారా వారి ప్రస్తుత DSL/ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను సులభంగా ఫైబర్ కనెక్షన్‌గా మార్చుకోవచ్చు.

FTTH

ఇది FTTH సేవల యుగం కాబట్టి వినియోగదారులు అప్‌గ్రేడ్ చేయడానికి ఇది చాలా మంచి ప్రోత్సాహకం. ఫైబర్ ISPల (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్) విభాగంలో BSNL మూడవ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ వంటివి ముందుస్థానంలో కొనసాగుతున్నాయి. BSNL అందించే ఈ ఆఫర్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా దాన్ని పొందడానికి వెంటనే మీ సమీపంలోని BSNL కార్యాలయానికి కాల్ చేయండి.

300 Mbps వేగంతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

300 Mbps వేగంతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

ప్రస్తుత సమయంలో ఇంటర్నెట్ యొక్క అవసరం అధికంగా ఉన్నందున కొత్త కనెక్షన్ ని పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా అధిక వేగంతో లభించే ప్లాన్ లను పొందాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం BSNL రూ.1,499 ధర వద్ద అందించే ప్లాన్ తో వినియోగదారులకు 300 Mbps ఇంటర్నెట్ అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ వేగాన్ని అందిస్తుంది. డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ రెండింటికీ ఇంటర్నెట్ వేగం సుష్టంగా ఉంటుంది. దీనితో పాటు వినియోగదారులు ప్రతి నెలా 4TB వరకు ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను కూడా పొందుతారు. ఇది మీ యొక్క ప్రైవేట్ ఆపరేటర్ల నుండి పొందే దానికంటే ఎక్కువ. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యొక్క OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనం కూడా వినియోగదారుల కోసం బండిల్ చేయబడింది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యొక్క వాస్తవ ధర సంవత్సరానికి రూ.1,499 అని గమనించండి. కానీ మీరు ఇక్కడ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా పొందుతారు.

300 Mbps ప్లాన్‌లను

BSNL సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం ఇతర 300 Mbps ప్లాన్‌లను కూడా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లు ఎలాంటి OTT ప్రయోజనాలను అందించవు మరియు నెలకు అధిక ఖర్చుతో లభిస్తాయి. అవి అధిక ధరను కలిగి ఉండడానికి కారణం అవి ఎక్కువ FUP డేటాను తీసుకురావడమే. రూ.2499 మరియు రూ.4499 ధరల వద్ద లభించే ప్లాన్‌లతో వినియోగదారులు వరుసగా 5TB మరియు 6.5TB నెలవారీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లు పెద్ద పెద్ద సంస్థలు లేదా లైబ్రరీలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజూ టన్నుల కొద్దీ ప్రజలు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతారు. కావున ఈ అధిక-ధరతో లభించే ప్లాన్‌లతో లభించే FUP డేటా వినియోగం కూడా మంచిదే.

BSNL 5G సర్వీస్

BSNL 5G సర్వీస్

BSNL టెలికాం సంస్థ తన యొక్క 5G సర్వీసులను NSA (నాన్-స్టాండలోన్) నెట్‌వర్క్‌ల విడుదలతో ప్రారంభించనున్నది. బేస్ 4G కోర్ నెట్‌వర్క్‌ నిర్మాణంతో దీనికి నాంది పలకవచ్చు. 5G NSA BSNL కోసం తక్కువ బడ్జెట్ ధరలోనే స్నేహపూర్వకంగా లభిస్తుంది. అయితే 5G SAకి కోసం పూర్తి స్థాయిలో కొత్త వ్యవస్థను సెటప్ చేయవలసి ఉంటుంది. దీని కోసం BSNL వద్ద తగినంత డబ్బు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇంతకుముందు గల స్వదేశీ పరికరాలు మరియు టెక్నాలజీను ఉపయోగించి బిఎస్‌ఎన్‌ఎల్ 5G పై పని చేస్తున్నట్లు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) అధికారి తెలిపారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో 5G నెట్‌వర్క్‌లను ఆశించవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL Limited Period Offer: Fiber Broadband Upgrade Users Brings Rs.1200 Benefit

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X