వర్క్ ఫ్రమ్ హోమ్ యూజర్లకు తక్కువ ధరలో అనువైన BSNL 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు

|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇప్పుడు ప్రైవేట్ టెల్కోలకు పోటీగా తక్కువ ధరలోనే ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నది. 4G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన కొన్ని ప్రాంతాలలోని వినియోగదారులకు టన్నుల కొద్ది ప్రయోజనాలతో 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇప్పటికి ఇంటి వద్ద నుండి పని చేస్తున్న వినియోగదారులకు అధిక డేటా ప్రయోజనాలతో లభించే కొన్ని ప్లాన్‌ల గురించి వివరంగా చూడబోతున్నాము. ఇటువంటి వినియోగదారులు గణనీయమైన అధిక వ్యాలిడిటీతో పాటుగా టన్నుల కొద్దీ డేటా ప్రయోజనాల కోసం చూస్తున్నారు. ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ధరలను పెంచడంతో ఇప్పుడు ఎక్కువ మంది BSNL వైపు మక్కువ చూపుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో BSNL యొక్క ప్లాన్‌లు ఇతర టెల్కోల కంటే మెరుగైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL రూ.599 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్

BSNL రూ.599 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్

BSNL యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ అనేది రూ.599 ధర వద్ద లభిస్తుంది. ఇది 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం చెల్లుబాటులో 5GB రోజువారీ డేటాను మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. దేశంలోని టెలికాం ఆపరేటర్లలో ఏదీ కూడా అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించడం లేదు. 5GB డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి పడిపోతుంది.అదనంగా వినియోగదారులు జింగ్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఇంకా వినియోగదారులకు 12 AM మరియు 5 AM మధ్య టెల్కో అందించే అపరిమిత ఉచిత హై-స్పీడ్ డేటా ప్రయోజనం కూడా ఉంది. ఇది రోజు వారి FUP డేటాను ప్రభావితం చేయదు.

ఎయిర్‌టెల్ DTH vs టాటా ప్లే DTH: పోటాపోటీగా ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లు...ఎయిర్‌టెల్ DTH vs టాటా ప్లే DTH: పోటాపోటీగా ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లు...

BSNL STV_299
 

BSNL STV_299

మీరు డినామినేషన్‌లో తక్కువ ధరలో దేనికైనా వెళ్లాలనుకుంటే కనుక STV_299 ప్లాన్ చాలా అర్ధవంతంగా ఉంటుంది. ఇది 30 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. FUP డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbps కి తగ్గించబడుతుంది.

BSNL STV_247

BSNL STV_247

మరింత సరసమైన ధరలో కూడా BSNL రూ.247 వోచర్‌ను అందిస్తుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో 50GB హై-స్పీడ్ లంప్-సమ్ డేటాతో వస్తుంది. ఇది మొత్తం ఒకేసారి ఉపయోగించవచ్చు. ఇంకా వినియోగదారులు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంతో పాటుగా BSNL ట్యూన్స్, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు.

BSNL రూ.2399 లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌

BSNL రూ.2399 లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో రూ.2399 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 90 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 3GB రోజువారీ డేటా వంటి ప్రయోజనాలతో అందిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క గొప్పదనం ఏమిటంటే మీరు డేటా గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఇది 3GB రోజువారీ డేటాతో వస్తుంది. దేశంలో 4G నెట్‌వర్క్‌లు లేనప్పటికీ ఇది కంపెనీ నుండి లభించే పెద్ద సర్వీస్ చెల్లుబాటుతో లభించే బలవంతపు ఆఫర్ కూడా అవుతుంది. BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు ప్రస్తుతం దేశంలో అత్యంత సరసమైనవి మరియు ఇలాంటి ఆఫర్‌లతో మరింత ఆకర్షణీయంగా మారాయని గమనించండి. ప్రభుత్వ ఆధీనంలోని టెల్కో కూడా తన ఇంట్లో తయారు చేసిన 4G నెట్‌వర్క్‌లను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పని చేస్తోంది.

BSNL 4G డేటా వోచర్‌లు

BSNL 4G డేటా వోచర్‌లు

BSNL టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.100 ధర లోపు ఆరు డేటా వోచర్‌లను అందిస్తోంది. ఈ వోచర్‌ల ధరలు వరుసగా రూ.19, రూ.56, రూ.75, రూ.94, రూ.97 మరియు రూ.98లుగా ఉన్నాయి. ఇందులో రూ.19 ధర వద్ద లభించే వోచర్‌తో వినియోగదారులు 1రోజు సర్వీస్ వాలిడిటీతో 2GB డేటాను పొందుతారు. మీకు ఏకమొత్తంలో ఎక్కువ డేటా కావాలంటే మీరు రూ.56 ధర వద్ద లభించే డేటా వోచర్‌కు వెళ్లవచ్చు. ఇది పది రోజుల చెల్లుబాటు కాలానికి 10GB డేటాతో పాటుగా జింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉచితంగా అందిస్తుంది. రూ.75 ధర వద్ద లభించే వోచర్ 50 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఇది 2GB డేటాతో పాటు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ మరియు 50 రోజుల పాటు ఉచిత PRBTని అందిస్తుంది. రూ.94 ధర వద్ద లభించే వోచర్ రూ.75 వోచర్ లాగానే లభిస్తుంది. కానీ ఇది 75 రోజులలోపు వినియోగించుకోవాల్సిన 3GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా 60 రోజుల పాటు PRBTతో పాటు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Low Cost 4G Prepaid Plans Suitable For Work From Home Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X