BSNLమొబైల్ వాలెట్ వచ్చేసింది!

మొబిక్విక్ తో బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం

By Madhavi Lagishetty
|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మొబైల్ వాలెట్ ను అందుబాటులోకి తెచ్చింది. వందమిలియన్ల మంది వినియోగదారల బిల్లు చెల్లింపులు చేయడానికి ఇ-కామర్స్ ప్లాట్ ఫాంలపై లావాదేవీలను ప్రారంభించనుంది.

BSNL mobile wallet app launched in partnership with MobiKwik

మొబిక్విక్ భాగస్వామ్యంతో ఈ వాలెట్ ను తెచ్చినట్లు సంస్థ పేర్కొంది. నెట్ వర్క్ లో సుమారు 1.5మిలియన్లు మంది వ్యాపారులన్న బిఎస్ఎన్ఎల్ వాలెట్ లో భారత టెలికాం సంస్థ భారత్ లో అతిపెద్ద వాటా గా ఉంది. ఈ యాప్ వేగవంతమై ఆన్ లైన్ లో రీఛార్లు, బిల్లు చెల్లింపులు, షాపింగ్ మరియు బస్సు బుక్సింగ్ ను చేసుకోవచ్చు.

ఇది ఏ మొబైల్ ఫోన్ నెటవర్క్ అయినా సరే రీఛార్జ్ చేయడానికి అత్యంత సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు సులభంగా కూడా ఉంది. వినియోగదారులు అన్ని టాప్ అప్స్ , ఎస్ఎంఎస్ డెటా, (జిపిఆర్ఎస్ 2జి, 3జి, 4జి ) స్ధానికి ఎస్టిడి, ఐఎస్డి, పోస్ట్ పేయిడ్, డిటిహెచ్ ప్లాన్స్, వోచర్లు, మరియు పూర్తి టాక్ టైమ్ రీచార్జ్ ఆఫర్స్ పొందవచ్చు. వినియోగదారులు కూడా ఐఆర్ఎస్ సి రైలు టిక్కెట్లు కోసం బిఎస్ఎన్ఎల్ వాలెట్ తో చెల్లించవచ్చు.

Redmi Note 5A వచ్చేసింది, సేల్ ఈ రోజు నుంచేRedmi Note 5A వచ్చేసింది, సేల్ ఈ రోజు నుంచే

ఈ కోబ్రాండెడ్ వాలెట్ తో వినియోగదారులందరికీ సులభంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించవచ్చని వాలెట్ ప్రారంభం సందర్భంగా టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.

ఈ వాలెట్ ద్వారా తమకున్న 10కోట్లకు పైగా కస్టమర్లు నిరంతరాయంగా , సులభతరంగా లావాదేవీలను నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బిఎస్ ఎన్ ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రధాని మోడీ ద్రుష్టిని సాధించడంలో మరో ముఖ్యమైన మైలు రాయిని తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో భాగమైనందుకు మేము బిఎస్ ఎన్ఎల్ గర్వపడుతున్నామన్నారు.

బిఎస్ఎన్ఎల్ తో భాగస్వామ్యం విశ్వసనీయ ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు డిజిటల్ చెల్లింపులు యాక్సెస్ తో భారతదేశంలో మాస్ సాధికారమివ్వడమని మొబిక్విక్ వ్యవస్థాపకుడు, సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. బిఎస్ఎన్ఎల్ వాలెట్ ప్రజలను బిల్లులు చెల్లించడానికి, వారి ఫోన్ కనెక్షన్లను రీఛార్జీ చేసి వారి రోజువారి కొనుగోళ్లు చెల్లించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మరియు ఫీచర్ ఫోన్ల మీద వాలెట్ పనిచేస్తుందని బిఎస్ ఎన్ ఎల్ ఛైర్మన్ శ్రీవాస్తవ తెలిపారు.

Best Mobiles in India

Read more about:
English summary
The wallet has been developed and issued by MobiKwik on behalf of BSNL.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X