Home
News

మదర్స్‌ డే సందర్భంగా BSNL రీఛార్జ్‌ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్లు.. డిస్కౌంట్‌, వ్యాలిడిటీ పొడిగింపు..!

Mothers Day BSNL Offers 2025 : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మదర్స్‌ డే (మార్చి 11) సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటనలు చేసింది. కొన్ని రీఛార్జ్‌ ప్లాన్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతోపాటు మరికొన్ని ప్లాన్‌లకు అదనపు వ్యాలిడిటీని అందించనుంది. మార్చి 7 వ తేదీ నుంచి మార్చి 14 వ తేదీ మధ్య రీఛార్జ్‌ చేసుకొనే యూజర్లు ఈ ప్రయోజనాలను పొందుతారని సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా వెల్లడించింది.

BSNL రూ.2399, రూ.997, రూ.599 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లపై 5 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా చేసే రీఛార్జ్‌లకే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మూడు రీఛార్జ్‌ ప్లాన్‌ పూర్తి ప్రయోజనాలు వివరాలు.

BSNL mother s day offer

BSNL రూ.599 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (BSNL Rs599 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు ప్రతిరోజు 3GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

ఈ ప్రయోజనాలతోపాటు BiTV ను కూడా ఉపయోగించుకోవచ్చు. మదర్స్‌ డే సందర్భంగా ఈ ప్లాన్‌పై 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే ఈ ప్లాన్ పై రూ.30 తగ్గింపును పొందవచ్చు. మార్చి 14 వరకే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

రూ.997 రీఛార్జ్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 160 రోజులుగా ఉంది. దీంతోపాటు BiTV ను కూడా వినియోగించుకోవచ్చు.

మదర్స్‌ డే ఆఫర్‌లో (BSNL Rs997 Recharge Plan) భాగంగా రూ.997 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌పై 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.947 కే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మార్చి 7 నుంచి మార్చి 14 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందిస్తోంది.

రూ.2399 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ BSNL ప్లాన్‌లో (BSNL Rs2399 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 395 రోజులుగా ఉంది. వీటితోపాటు BiTV యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. మొబైల్‌ నుంచే 350 లైవ్‌ టీవీ ఛానళ్లను వీక్షించేందుకు అవకాశం ఉంది. మదర్స్‌ డే ఆఫర్‌లో భాగంగా రూ.120 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

BSNL మరో రెండు రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. రూ.1499 రీఛార్జ్‌ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుండగా.. మదర్స్‌ డే సందర్భంగా 365 రోజుల వ్యాలిడిటీని అందించనుంది. మార్చి 7 వ తేదీ నుంచి 14 వ తేదీ మధ్యలో చేసే రీఛార్జ్‌లపై ఈ ఆఫర్‌ వరిస్తుంది.

దీంతోపాటు రూ.1999 రీఛార్జ్‌ ప్లాన్‌పై ప్రస్తుతం 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. మదర్స్‌ డే సందర్భంగా ఈ ప్లాన్‌లో 380 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా చేసే రీఛార్జ్‌లపైనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL mother's day offer 5 percent discount and validity extension on prepaid recharge plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X