ఎవరూ ఊహించని సర్వీసులను ప్రారంభించిన BSNL.. యూజర్లకు పండగే.. ఎలా యాక్టివేట్ చేయాలి?
BSNL సరికొత్త నిర్ణయాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే కొత్త లోగో విడుదల సహా 7 ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటన చేసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తాజాగా ఎవరూ ఉహించని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం BSNL 4G నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 50 వేలకు పైగా 4G టవర్లను ఏర్పాటు చేసిన సంస్థ.. ఈ సంవత్సరం చివరి నాటికి 75 వేల టవర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీంతోపాటు జూన్ 2025 నాటికి 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభిస్తామని టెలికాం మంత్రి గత నెలలో ప్రకటన చేశారు.
తాజాగా BSNL.. నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీసులను (BSNL National Wi-fi Roaming Service) ప్రారంభించింది. దీని ద్వారా BSNL FTTH (ఫైబర్ టూ ది హోం) యూజర్లు.. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోగలగుతారు. ప్రస్తుతానికి ఈ సర్వీసులు FTTH వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు హైస్పీ్డ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు వీలుగా కొత్త సర్వీసులను తీసుకొచ్చింది.

BSNL FTTH యూజర్లు ప్రస్తుతం రూటర్ ఎంత పరిధిలో సిగ్నల్ అందించగలదో.. అంత వరకు మాత్రమే ఇంటర్నెట్‌కు కనెక్ట్ కావచ్చు. అయితే ఈ వైఫై రోమింగ్ సర్వీస్ ద్వారా FTTH యూజర్లు దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా BSNL ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డులు వినియోగిస్తున్న వారికి ప్రస్తుతం హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. ఈ నేషనల్ వైఫై రోమింగ్ ద్వారా FTTH యూజర్లు దేశంలో BSNL వైఫై అందుబాటులో ఉన్న ప్రతి చోటా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ వైఫై సౌకర్యం ఉంటే అక్కడ కూడా ఈ కొత్త సర్వీస్ ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
BSNL FTTH వినియోగదారులు.. కొత్తగా ఆవిష్కరించిన నేషనల్ వైఫై రోమింగ్ సర్వీస్‌లను వినియోగించుకొనేందుకు యాక్టివ్ FTTH కనెక్షన్ ఉండాలి. అనంతరం BSNL వైఫై రోమింగ్ పోర్టల్ http://portal.in/ftth/wifiroaming లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. BSNL FTTH కనెక్షన్ నంబర్ సహా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.
ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ సమయంలో యాక్టివ్ FTTH కనెక్షన్ నంబర్ తోపాటు ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. Captcha కోడ్ సహా OTP ను ఎంటర్ చేయాలి. OTP ధ్రువీకరణ అనంతరం మీ బీఎస్‌ఎన్‌ఎల్ FTTH కనెక్షన్ పై నేషనల్ వైఫై రోమింగ్ సర్వీసులు యాక్టివేట్ కానున్నాయి.
ప్రైవేటు టెలికాం ప్రొవైడర్ లు ఈ తరహా సేవలను అందించే అవకాశం లేదు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలకు ఇప్పటికే హై స్పీడ్ అందించే నెట్ వర్క్ అందుబాటులో ఉంది. సిమ్ కార్డు ద్వారా అత్యవసర సమయాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ ను ఆ యూజర్లు ఉపయోగించుకోగలుగుతారు.


Click it and Unblock the Notifications








