BSNL నుంచి ఊహించని ఆఫర్!! రూ.75 వోచర్‌తో ఉచితంగా 4G సిమ్ కార్డు
ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఒకే ఒక టెల్కో బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లను పొందే వారికి ఉచితంగా 4G సిమ్ కార్డును అందించడం ప్రారంభించింది. ఈ ఉచిత 4G సిమ్ కార్డ్ ఆఫర్ గత వారం నుండి కేరళ మరియు తమిళనాడు టెలికాం సర్కిల్‌లలో ప్రత్యేక్షంగా ఉంది మరియు ఇది మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఇతర సర్కిల్‌లలో ఈ ఆఫర్ లభ్యత గురించి ఎటువంటి సమాచారం లేదు. ఈ ఆఫర్ లో భాగంగా కొత్తగా బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్ లైన్ కనెక్షన్ ను తీసుకునే కస్టమర్లు రూ.75 ప్లాన్ వోచర్‌తో 4G సిమ్ కార్డును ఉచితంగా అందుకుంటారు. భారత్ ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్ మరియు ల్యాండ్‌లైన్ ప్లాన్‌లు ఈ ఆఫర్‌లో భాగంగా ఉంటాయి. కంపెనీ అందించే ఈ ప్రత్యేక ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లతో BSNL ఉచిత 4G సిమ్ కార్డ్ ఆఫర్
BSNL టెల్కో ప్రతిసారీ ప్రత్యేకమైన ఆఫర్లతో వస్తుంది. ప్రస్తుత ఈ ఆఫర్ కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తుంది. ఇటీవలి కాలంలో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు కొత్త కనెక్షన్‌ల కోసం పెరిగిన డిమాండ్‌ను చూస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ కూడా దీనికి మినహాయింపు కాదు, ముఖ్యంగా రూ.449 సరసమైన ధరల వద్ద భారత్ ఫైబర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన తరువాత కొత్త ఆఫర్లను అందించడం మరింత పెరిగాయి.

బిఎస్ఎన్ఎల్ DSL బ్రాడ్‌బ్యాండ్, భారత్ ఫైబర్ వంటి విస్తృత శ్రేణి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను కలిగి ఉండడమే కాకుండా అధిక సంఖ్యలో ల్యాండ్ లైన్ ప్లాన్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. 4G సిమ్ కార్డ్ ను ఉచితంగా పొందిన వారికి రూ.75 ప్లాన్‌ను ఉచితంగా అందిస్తుంది. రూ.75 వోచర్ ప్లాన్ 100నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ మరియు 2GB డేటాను 60 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ ఆఫర్ ను మొదటగా ఫిబ్రవరి 20, 2021 న ప్రవేశపెట్టారు అయితే మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది అని సంస్థ ఇప్పటికే సూచించింది.

బిఎస్ఎన్ఎల్ టెల్కో ఈ ఉచిత ఆఫర్‌ను ఇతర టెలికాం సర్కిల్‌లలో ఎప్పుడు ప్రారంభించబోతోందో అనే దాని మీద ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ఈ ఆఫర్ అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారిక ధృవీకరణ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండవలసిన అవసరం ఉంది.

భారత్ ఫైబర్ ప్లాన్‌ల కొత్త సవరణలు
బిఎస్ఎన్ఎల్ టెల్కో ఇటీవల దేశవ్యాప్తంగా తన భారత్ ఫైబర్ ప్లాన్‌లను సవరించింది. FUP పరిమితి మరియు మరింత అధిక వేగవంతమైన స్పీడ్ తో ప్లాన్ లను అందిస్తుంది. ISP ఇప్పుడు అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో 300 Mbps వేగంతో అందిస్తోంది. ఇంతకుముందు 300Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర కేవలం 1,499 రూపాయల ధర వద్ద లభించేవి. కానీ ఇప్పుడు రూ.4,499 మరియు ఆ పైన ఉన్న అన్ని భారత్ ఫైబర్ ప్లాన్‌లు కూడా 300Mbps వేగంతో లభిస్తాయి.


Click it and Unblock the Notifications








