BSNL కొత్త ప్లాన్‌లు!! 30 రోజుల వాలిడిటీ, 180GB డేటాతో ప్రైవేట్ టెల్కోలకు పోటీగా

|

భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వివిధ సర్కిల్‌లలోని చందాదారుల కోసం కొత్తగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేస్తోంది. తాజాగా ఈ ప్లాన్‌లు పంజాబ్ సర్కిల్ లో అందుబాటులోకి రానున్నాయి. ఏదేమైనా ఇతర సర్కిల్‌లలో కూడా త్వరలోనే ఈ ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా ఆకర్షణీయమైన ఆఫర్‌లను విడుదల చేసి కొత్త చందాదారుల సంఖ్యను మరింత పెంచింది. BSNL టెల్కో తన 4G నెట్‌వర్క్ కోసం ఎదురుచూస్తూనే ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిరంతరం అందిస్తోంది. ఈ టెల్కో కొత్తగా అందుబాటులోకి తీసుకొనివచ్చే ప్లాన్ ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.102 ప్రీపెయిడ్ ప్లాన్‌ వివరాలు

BSNL రూ.102 ప్రీపెయిడ్ ప్లాన్‌ వివరాలు

BSNL నుండి ఉత్తమమైన మరియు అత్యంత ఉపయోగకరమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకటి PV102 ప్లాన్. ఇది ఈ సర్కిల్‌లో ప్రారంభించబడింది. ఈ ప్లాన్ ఏ డేటా ప్రయోజనంతోనూ రాదు కానీ వాయిస్ కాలింగ్ కోసం మాత్రమే చూసే వినియోగదారుల కోసం ఈ ప్లాన్ ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. చందాదారులు రూ.102 ధర వద్ద కొనుగోలు చేసే ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పొందుతారు.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండిఅమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి

BSNL రూ.143 ప్రీపెయిడ్ ప్లాన్‌ వివరాలు

BSNL రూ.143 ప్రీపెయిడ్ ప్లాన్‌ వివరాలు

అదే తరహాలో లభించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.143 ధర వద్ద లభిస్తుంది. ఇది PV143 గా జాబితా చేయబడింది. ఈ ప్లాన్ గతంలోని ప్లాన్ కు భిన్నంగా ఉండి మెరుగైన డేటాను రవాణా చేస్తుంది. చందాదారులు 30 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 1.5GB డేటాను పొందుతారు. ఈ డేటాతో పాటు సబ్‌స్క్రైబర్‌లు అదే 30 రోజుల చెల్లుబాటు వ్యవధికి అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS లను కూడా పొందుతారు. ప్రైవేట్ టెల్కోలలో రిలయన్స్ జియో సంస్థ రూ.199 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ఇదే రోజువారి 1.5GB డేటా సమానమైన ప్రయోజనాలతో వస్తుంది.

7000mAh పెద్ద బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!! ధర కూడా తక్కువే....7000mAh పెద్ద బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!! ధర కూడా తక్కువే....

BSNL రూ.396 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ.396 ప్రీపెయిడ్ ప్లాన్

PV396 గా జాబితా చేయబడిన BSNL యొక్క మరో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.396 ధర వద్ద లభిస్తుంది. ప్లాన్ పొడిగింపు విభాగం కింద జాబితా చేయబడిన BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ 90 రోజుల వ్యవధిలో చందాదారులు రోజుకు 2GB డేటాను పొందుతారు. దీనితో పాటు వారు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇంతకు ముందు BSNL టెల్కో రూ.485 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే ఇది రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. రూ.396 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభంతో ఇప్పుడు చందాదారులు ఖరీదైన ప్లాన్ కంటే తాజా ప్లాన్ కోసం వెళ్లే అవకాశం ఉంది. అయితే రూ.485 ప్లాన్ మరియు రూ.396 ప్లాన్ ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం డేటా మాత్రమే కాదు. ఎందుకంటే రూ.485 ప్లాన్ EROS సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది.

BSNL ఇన్‌యాక్టివ్‌ వినియోగదారుల కోసం

BSNL ఇన్‌యాక్టివ్‌ వినియోగదారుల కోసం

BSNL ద్వారా రూ .1199 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా GPII కస్టమర్ల కోసం తిరిగి ప్రవేశపెట్టబడింది. అంటే BSNL నెట్‌వర్క్‌లో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న చందాదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 365 రోజుల మొత్తం చెల్లుబాటు వ్యవధికి 24GB డేటాతో వస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL New Plans‌ Offers Up to 180GB Data!! Competing With Private Telcos with 60, 30 Days Validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X