BSNL సిమ్ కార్డుల డోర్ డెలివరీ.. ఇంటి నుంచే సింపుల్‌గా ఆర్డర్ చేసుకోవచ్చు..!
గతంలో సిమ్ కార్డును కొనుగోలు చేయాలంటే కచ్చితంగా ఆయా టెలికాం సంస్థల ఆఫ్‌లైన్ స్టోర్‌లకు సందర్శించాల్సి ఉండేది. అయితే అనంతరం ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా నేరుగా ఇంటికే ఆర్డర్ చేసుకొనేందుకు అవకాశం వచ్చింది. అన్ని ప్రైవేటు టెలికాం సంస్థలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL సిమ్ కార్డుల డోర్ డెలివరీ సేవల్లోకి వచ్చింది.
ప్రత్యేక లింక్ :
BSNL వెబ్‌సైట్ నుంచే నేరుగా KYC పూర్తి చేసేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సెల్ఫ్ KYC ను పూర్తి చేసుకోవచ్చు. BSNL కార్యాలయాలకు వెళ్లా్ల్సిన అవసరం లేకుండానే ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డుల పొందవచ్చు.

కొత్త సిమ్ కార్డులతోపాటు పోర్టింగ్ కూడా :
దీంతోపాటు ఇతర నెట్‌వర్క్‌ల నుంచి BSNL లోకి పోర్టింగ్ అయ్యేందుకు కూడా ఈ లింక్‌లోనే అవకాశం కల్పించింది. ఇలా ఆర్డర్ చేసిన సిమ్ కార్డులను నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. ఇందుకోసం ఈ లింక్ https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎవరికోసం సిమ్ కార్డు కొనుగోలు చేస్తున్నారు :
ఈ లింక్ క్లిక్ చేసిన అనంతరం పిన్‌కోడ్, పేరు, ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సిమ్ కార్డు ఎవరి కోసం కొనుగోలు చేస్తున్నారో వెల్లడించాల్సి ఉంటుంది. సొంతంగా ఉపయోగిస్తారా, కుటుంబ సభ్యుల కోసం కొనుగోలు చేస్తున్నారో వెల్లడించాల్సి ఉంటుంది.
హెల్ప్‌లైన్ నంబర్ :
అనంతరం ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ KYC ప్రక్రియను పూర్తి చేసే సమయంలో ఎటువంటి సమస్యలు తెలెత్తినా సత్వరం పరిష్కారం అయ్యేందుకు వీలుగా BSNL హెల్ప్‌లైన్ నంబర్ 18001801503 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.
ఉచితంగా సర్వీసులు అందిస్తుందా?
ఇప్పటికే ప్రైవేటు టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలు ఈ తరహా హోం డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి. ఈ సంస్థలు హోం డెలివరీ సర్వీసులను ఉచితంగా అందిస్తున్నాయి. అయితే BSNL ఈ కొత్త సర్వీసుల కోసం ఎటువంటి ఛార్జీ వసూలు చేస్తుందా లేదా ఉచితంగా సర్వీసులు అందిస్తుందా తెలియాల్సి ఉంది.
* BSNL ఇటీవల తొలిసారిగా Q-5A ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సర్వీసులను ప్రారంభించింది. సంస్థలు సహా ఇతర కార్యాలయాలకు సిమ్ కార్డు లేకుండా వైర్‌లెస్ పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపింది. క్యూ అంటే క్వాంటమ్ అని అర్థం. ఇందులో ఎటువంటి వాయిస్ సదుపాయం ఉండదు.
ఇతర వైర్‌లైస్ ఇంటర్నెట్ సర్వీసుల తరహాలోనే BSNL Q-5A కస్టమర్లు CPE పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో 100 MBPS వేగాన్ని అందిస్తుంది. ప్రారంభ ప్లాన్ ధర రూ.999 గా ఉంది. రూ.1499 ప్లాన్ ద్వారా 300 MBPS వేగంతో ఇంటర్నెట్‌ను పొందవచ్చు.
ప్రస్తుతం ఈ సర్వీసులు హైదరాబాద్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరీ, విశాఖపట్నం, చండీగఢ్, పుణే, గ్వాలియర్ వంటి ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని పేర్కొంది.


Click it and Unblock the Notifications








