Home
News

రూ.300 కంటే తక్కువ ధరలో 2GB డేటాతో BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL( భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ) గతం కంటే భిన్నంగా గత సంవత్సరం భారీగా కొత్త యూజర్లను సంపాదించుకుంది. అదే విధంగా ఏకంగా 17 సంవత్సరాల తర్వాత లాభాల్లోకి వచ్చినట్లు సంస్థ ప్రకటన చేసింది. 2024- 25 మూడో త్రైమాసికంలో సంస్థ రూ.262 కోట్లు లాభాలు సంపాదించింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు అందుబాటు ధరల్లో వివిధ రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను లాంచ్ చేస్తోంది.

తాజా BSNL రూ.300 కంటే తక్కువ ధరలో (BSNL New Prepaid Recharge Plans Under RS300) మూడు ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను విడుదల చేసింది. రూ.215, రూ.249, రూ.299 ధరలో మూడు ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ల కాలింగ్, డేటా, SMS సహా ఇతర ప్రయోజనాల పూర్తి వివరాలు మీకోసం.

BSNL New Prepaid Recharge plans under rs300

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.215 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా లోకల్‌, STD అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌ (BSNL RS215 Prepaid Recharge Plan) వ్యాలిడిటీ మొత్తంలో 60GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఛాలెంజర్ ఏరీనా, హార్డీ గేమ్స్‌, జింగ్‌ మ్యూజిక్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, గామెన్‌ వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.249 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటాను వినియోగించుకున్నాక.. డేటా స్పీడ్‌ 40kbps గా ఉండనుంది.

ఈ ప్లాన్ (BSNL RS249 Prepaid Recharge Plan) వ్యాలిడిటీ 45 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 90GB డేటాను వినియోగించుకోవచ్చు. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే 45 రోజుల ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 3GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం డేటా స్పీడ్ 40kbps గా ఉండనుంది. దీంతోపాటు లోకల్‌, STD అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం ఉంది. మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు.

ఈ ప్లాన్‌ (BSNL RS299 Prepaid Recharge Plan) వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. మరియు మొత్తంగా 90GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు ఎక్కువ డేటా అవసరాలు ఉండే యూజర్‌లకు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల నెట్‌వర్క్‌ అంతరాయాలను నివారించేందుకు వీలుగా టవర్ల వద్ద బ్యాటరీలను ఏర్పాటు చేసింది. విద్యుత్‌ అంతరాయాల సమయంలో సిగ్నల్స్‌కు ఇబ్బంది లేకుండా ఈ చర్యలు తీసుకుంది. 30,000 టవర్ల వద్ద బ్యాటరీలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీంతోపాటు 15000 పైగా ప్రస్తుతం పనిచేస్తున్నాయని పేర్కొంది. జూన్‌ 2025 నాటికి 35000 కు పైగా విద్యుత్‌ ప్లాంట్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

ఇప్పటికే BSNL 4G టవర్ల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఈ సంవత్సరం మే నాటికి దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. మరియు ఎంపిక చేసిన నగరాల్లో జూన్‌ నుంచి 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో టెస్టింగ్‌ కూడా పూర్తయినట్లు సమాచారం.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL New Prepaid Recharge plans with 2GB daily data under rs300 check full benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X