Home
News

BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...

బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ టెలికాం సంస్థ తన యొక్క యూజర్లను ఆకట్టుకోవడానికి వైవిధ్యమైన ప్రయోజనాలతో ఎల్లప్పుడూ కొత్త ప్లాన్ లను ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా రూ.197 ధర వద్ద వచ్చిన మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ 197 రోజుల చెల్లుబాటుతో అనేక ఉచిత ప్రయోజనాలతో లభిస్తుంది. ప్రభుత్వ-టెల్కో ప్రత్యేకంగా అందించే కొన్ని ఆఫర్‌లు మొదటి 18 రోజులు మాత్రమే చురుకుగా ఉంటాయి. అయితే మిగిలిన 180 రోజులలో టెల్కోకు చెందిన కొన్ని సేవలు చురుకుగా ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ రూ.197 వోచర్‌ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ రూ.197 వోచర్‌ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.197 వోచర్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS‌లతో పాటు 2GB రోజువారీ డేటాను పొందుతారు. ఈ ఫ్రీబీస్ అన్నీ కూడా మొదటి 18 రోజులు మాత్రమే చురుకుగా ఉంటాయి. వినియోగదారులు BSNL యొక్క వాయిస్ కాలింగ్ మరియు డేటా సేవతో కొనసాగాలంటే 18 రోజుల తర్వాత ఇతర టాప్-అప్ ప్లాన్‌లు లేదా డేటా వోచర్‌లను ఎంచుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్ లైవ్-స్ట్రీమింగ్ అప్లికేషన్ అయిన జింగ్ ఓవర్-ది-టాప్ (OTT) ఉచిత ప్రయోజనాన్ని కూడా వినియోగదారులకు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ అప్లికేషన్ యొక్క ప్రీమియం కంటెంట్ను ప్రసారం చేయగలరు. ఈ OTT ప్రయోజనం కూడా 18 రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.

ఫ్రీబీస్

ఫ్రీబీస్ గడువు ముగిస్తే అదనపు వాలిడిటీ ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నట్లయితే కనుక అది కేవలం మీ యొక్క ఫోన్ నెంబర్ చురుకుగా ఉంచడం కోసం అని అర్థం చేసుకోండి. మీ BSNL నంబర్ యాక్టీవ్ గా ఉంటే కనుక మీరు ప్రత్యేక టారిఫ్ వోచర్ (STV) తో రీఛార్జ్ చేసుకోని డేటా, వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను పొందవచ్చు.

BSNL నంబర్‌

మీ BSNL నంబర్‌ను యాక్టీవ్ చేయడానికి ప్లాన్ వోచర్ లేకపోతే కనుక ప్రభుత్వంచే నడుస్తున్న టెల్కో నుండి ఎటువంటి సేవలను స్వీకరించదు. అందువల్ల మీరు STV ని కొనుగోలు చేసినప్పటికీ మీకు ప్లాన్ వోచర్ ఉండదు మరియు STV పనిచేయదు. ఇది జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) అందించిన అపరిమిత ప్లాన్ పైన డేటా వోచర్‌లను కొనుగోలు చేసినట్లే పనిచేస్తుంది. ప్రారంభ వోచర్ యొక్క వాలిడిటీని విస్తరించడానికి లేదా సిమ్‌ను యాక్టీవ్ గా ఉంచడానికి వినియోగదారులకు ఇతర ప్లాన్ వోచర్‌లను కూడా బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL New Rs.197 Voucher Plan Offering 2GB Daily Data For 180 Days Validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X