BSNL నుంచి అతి త‌క్కువ ధ‌ర‌లో డైలీ 2GB డేటా ప్లాన్లు లాంచ్!

|

భార‌త ప్ర‌భుత్వ రంగం టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), త‌మ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ప్లాన్ల‌ను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా మ‌రో రెండు స‌రికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల‌ను ఆ సంస్థ వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేసింది. STV269 మరియు STV769 పేర్ల‌తో ఈ ప్లాన్‌ల‌ను విడుద‌ల చేసింది.

BSNL

ఇవి 30 రోజులు మరియు 90 రోజుల చెల్లుబాటుతో వ‌చ్చాయి. అధికంగా డేటాను వినియోగించే వినియోగదారులకు ఈ రెండు ప్లాన్‌లు మంచి ఎంపికలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ రెండు ప్లాన్‌ల ప్రయోజనాలు దాదాపుగా సమానంగా ఉంటాయి. ప్రస్తుతానికి, ఈ రెండు ప్లాన్‌ల ప్రయోజనాలను చూద్దాం. మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

BSNL STV 269 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు మరియు వివరాలు:

BSNL STV 269 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు మరియు వివరాలు:

BSNL నుండి కొత్తగా ప్రారంభించబడిన రూ.269 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 30 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. డేటా విషయానికొస్తే... ఇది 2GB రోజువారీ డేటాతో వస్తుంది. మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలతో వస్తుంది. BSNL ట్యూన్‌లను కూడా బండిల్ చేస్తుంది, ఇది వినియోగదారులు ఎటువంటి పరిమితులు లేకుండా పాటలను మార్చుకోవ‌డానికి అనుమతిస్తుంది. ఛాలెంజెస్ అరేనా గేమ్‌లు, ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్, లిస్ట్న్ పాడ్‌క్యాస్ట్ సర్వీసెస్, హార్డీ మొబైల్ గేమ్ సర్వీస్, లోక్‌ధున్ మరియు జింగ్ వంటి మరిన్ని ప్రయోజనాలు ఈ ప్లాన్‌తో ఉన్నాయి.

BSNL STV769 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు మరియు వివరాలు:

BSNL STV769 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు మరియు వివరాలు:

BSNL STV769 కూడా STV269 లాగానే ఉంటుంది. ఈ ప్లాన్ ధర రూ.769. ఇది 90 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తుంది. వినియోగదారులు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు పైన పేర్కొన్న రూ.269 ప్లాన్‌తో వచ్చే అదనపు ప్రయోజనాలను పొందుతారు.

ఇవి ప్రభుత్వ నిర్వహణలోని టెలికాం ఆపరేటర్ నుండి కొత్తగా ప్రారంభించబడిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు. రెండు ప్లాన్‌లు ఇప్పుడు వినియోగదారులు రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లు 30-రోజులు లేదా 90-రోజుల ప్లాన్‌ని కోరుకునే వ్యక్తులకు మంచి ఆప్ష‌న్లుగా ఉంటాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వినియోగదారుల కోసం కనీసం 30 రోజులు లేదా నెలవారీ చెల్లుబాటు ప్లాన్‌ల‌ను అందుబాటులోకి తేవాల‌ని చర్యలు తీసుకున్న తర్వాత, అన్ని ప్రైవేట్ టెల్కోలు, అలాగే BSNL, అటువంటి వ్యాలిడిటీలతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించాయి.

అదేవిధంగా, BSNL నుంచి పాకెట్ ఫ్రెండ్లీ ధ‌ర‌లో ఉన్న రూ.228, రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం:

అదేవిధంగా, BSNL నుంచి పాకెట్ ఫ్రెండ్లీ ధ‌ర‌లో ఉన్న రూ.228, రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం:

ఈ BSNL STV 228 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్రయోజనాలతో పాటు, BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్‌ని ఎంచుకున్న సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లో ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌ను కూడా ఆఫ‌ర్‌ చేస్తుంది.

BSNL Rs. 239 ప్రీపెయిడ్ ప్లాన్:

BSNL Rs. 239 ప్రీపెయిడ్ ప్లాన్:

ఈ BSNL STV 239 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రూ.10 టాక్‌టైమ్ పొంద‌వ‌చ్చు. ఈ టాక్‌టైమ్ వాల్యూ మెయిన్ అకౌంట్‌కు యాడ్ చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఒక నెల ఉంటుంది. ప్లాన్ గ‌డువు ముగిసిన త‌ర్వాత అదే రోజున సేమ్ అమౌంట్ చెల్లించి మ‌ళ్లీ రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. యూజ‌ర్ల‌కు 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ల‌తో పాటుగా, నెల రోజుల గ‌డువు ఉండే వ్యాలిడిటీ ప్లాన్ల‌ను అందించాల‌ని ఇటీవ‌ల ట్రాయ్ నెట్‌వ‌ర్క్ కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో BSNL ఈ ప్లాన్ల‌ను విడుద‌ల చేయ‌డం విశేషం. అయితే BSNL విడుద‌ల చేసిన ప్లాన్లు, ఇప్ప‌టికే Airtel, Vi నుంచి విడుద‌లైన ఇదే త‌ర‌హా ప్లాన్ల‌కు పోటీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

 

Best Mobiles in India

English summary
BSNL New Rs 269 and Rs 769 Prepaid Plans launched with huge data benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X