Home
News

BSNL అదిరిపోయే కొత్త ప్లాన్.. కేవలం రూ. 347కే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, లైవ్ టీవీ ఫ్రీ!

BSNL Rs 347 plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కొత్తగా రూ.347 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ కోరుకునేవాళ్లకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి కావలసినంత డేటా, ఇంకా లైవ్ టీవీ ఫ్రీగా చూడొచ్చు. అందుకే ఈ ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏవో చూద్దాం.

BSNL రూ.347 రీఛార్జ్ ప్లాన్‌లో ఇండియాలో ఎక్కడికైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఢిల్లీ, ముంబై వంటి MTNL ఏరియాల్లో కూడా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్‌లో ఉన్నా సరే, ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా ఫుల్లుగా మాట్లాడేసుకోవచ్చు. ఇంటర్నెట్ వాడేవాళ్లకి రోజుకి 2GB హై-స్పీడ్ డేటా వస్తుంది.

BSNL New Rs 347 Plan  Unlimited Calls  Data and Free Live TV  This the Best Deal Yet

ఇంకా రోజుకి 100 ఫ్రీ SMSలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులు. అంటే దాదాపు రెండు నెలలు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్‌లో BiTV సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. దీని ద్వారా 450కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌తో పాటు చాలా ఓటీటీ యాప్స్‌ను ఫ్రీగా చూడొచ్చు.

* BSNL నెట్‌వర్క్ మెరుగ్గా అవుతోంది

BSNL తన సర్వీసులను మెరుగుపరుచుకుంటూ, నెట్‌వర్క్‌ను కూడా భారీగా పెంచుతోంది. ఇప్పటికే 65 వేల కొత్త 4G టవర్లను స్టార్ట్ చేసింది. త్వరలోనే ఈ సంఖ్యను లక్షకు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. దీనివల్ల ఇండియా మొత్తం BSNL నెట్‌వర్క్ మరింత స్ట్రాంగ్ అవుతుంది, స్పీడ్ కూడా అదిరిపోతుంది.

* BSNLకి గవర్నమెంట్ సపోర్ట్..

BSNL, MTNL సంస్థలను మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఏకంగా రూ.6,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలను బాగు చేయడం కోసం ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్నేళ్లుగా BSNL సర్వీసులను మెరుగుపరచడానికి రూ.3.22 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది.

* BSNL దూకుడు మామూలుగా లేదుగా..

చాలా సంవత్సరాల ఫైనాన్షియల్ ఇబ్బందుల తర్వాత BSNL ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది. 2007 తర్వాత మొదటిసారిగా FY25 మూడో క్వార్టర్‌లో రూ.262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. నవంబర్ 2025 నాటికి BSNL మార్కెట్ షేర్ 8.03%కి చేరుకుంది. ఇప్పుడు BSNL కస్టమర్ల సంఖ్య 9.2 కోట్లకు పైగా ఉంది.

* ఇంకో బీఎస్‌ఎన్ఎల్ ప్లాన్

ఇటీవల BSNL తన X (ట్విట్టర్) అకౌంట్ ద్వారా మరో ప్లాన్‌ను అనౌన్స్ చేసింది. అదే BSNL రూ.411 డేటా వోచర్ ప్లాన్. ఈ ప్లాన్‌లో రోజుకి 2GB హై-స్పీడ్ డేటా వస్తుంది, అది కూడా ఏకంగా 90 రోజుల పాటు. అంటే మొత్తం 180GB డేటా. ఈ ప్లాన్‌లో కాలింగ్ బెనిఫిట్స్ మాత్రం లేవు.

కానీ ఎక్కువ డేటా కావాలనుకునేవాళ్లకి, అది కూడా తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీతో కావాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. మార్కెట్లో ఇంత తక్కువ ధరలో ఇంత ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్ ఇంకోటి లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs 347 plan offers unlimited calls, 2GB daily data, free live TV for 54 days. BSNL expands 4G, showing growth with government support.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X