బీఎస్ఎన్ఎల్ దూకుడు!

Posted By: Super

 బీఎస్ఎన్ఎల్ దూకుడు!

‘పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకునే క్రమంలో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తోంది.’

ల్యాండ్ లైన్ ఫోన్ విభాగాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. ల్యాండ్ లైన్ ఫోన్ లకు కొత్త సదుపాయాలను కల్పించే లక్ష్యంగా రూ.400కోట్లను వెచ్చించే యోచనలో బీఎస్ఎన్ఎల్ ప్రణాళికులు సిద్ధం చేస్తోంది. ‘ప్రధానంగా మొబైల్ ఫోన్‌లలో ఉన్న వీడియో కాలింగ్, కాల్ ట్రాన్స్‌ఫర్, డెరైక్టరీ వంటి సౌకర్యాలను ల్యాండ్‌లైన్స్‌కు కూడా అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్నాం. సంస్థకున్న ఎక్స్ఛేంజీలన్నింటికీ ఎన్‌జీఎన్ (నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్)గా మార్చే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం’ అని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఆర్‌కే ఉపాధ్యాయ్ చెప్పారు.

ఎన్ జీఎన్ (NGN) టెక్నాలజీ సదుపాయంతో ల్యాండ్ లైన్ యూజర్లు తమ మొబైల్ ఫోన్ లకు వచ్చే కాల్స్ ను ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ కనెక్షన్ కు డైవర్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వ్యవస్థ సౌజన్యంతో ఇతరత్ర అధునాత సేవలను యూజర్ పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ మార్చి 2013 నాటికి పూర్తికావచ్చని ఉపాధ్యాయ్ తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot