BSNL 4జీ లేటెస్ట్ అప్‌డేట్స్

బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేయబోతోన్న 4జీ నెట్‌వర్క్ సేవలకు సంబంధించి గతకొంత కాలంగా సందిగ్థ వాతావారణం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 4జీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు 2014లోనే బీఎస్ఎన్ఎల్ ప్రకటించినప్పటికి అది ఇప్పటి వరకు సాకారం కాలేదు. తాజాగా, The Hindu Businesslineలో పోస్ట్ అయిన ఓ కధనం ప్రకారం 2017, డిసెంబర్ నాటికి BSNL 4జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలత కేరళాలో...

ఈ రిపోర్టులో పోస్ట్ అయిన వివరాల ప్రకారం BSNL 4జీ సేవలు తొలత కేరళాలో అందుబాటులోకి రానున్నాయి. ఇందకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను జిల్లా కేంద్రాల్లో సెప్టంబర్ నాటికి ఇన్‌స్టాల్ చేయబోతున్నట్లు బీఎస్ఎన్ఎల్ కేరళా సర్కిల్ చీఫ్ మేనేజర్ ఆర్.మణి తెలిపారు.

 

కేరళలో 2200 4జీ సైట్‌లు..

డిసెంబర్ 2016లో బీఎస్ఎన్ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 2017 నాటికి మొదటి బ్యాచ్ 4జీ సర్వీసులు అందుబాటులోకి రావల్సి ఉంది. టెండర్ల విషయంలో జాప్యం జరగడం వల్ల ఈ ప్రాసెస్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం నాటికి కేరళలో 2200 4జీ సైట్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు కేరళ సర్కిల్ చీఫ్ మేనేజర్ ఆర్.మణి తెలిపారు. ఇదే సమయంలో 3జీ సైట్‌లను కూడా అప్‌గ్రేడ్ చేయబోతున్నట్లు తెలిపారు.

బీఎస్ఎన్ఎల్ వద్ద 2,500 మెగాహెర్ట్జ్ 4జీ స్పెక్ట్రమ్‌

4జీ సేవలను అందించేందుకుఅవసరమైన 2,500 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్ 8,313 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ లాంచ్‌కు సంబంధించి ఖచ్చితమైన సమచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

జియో 4జీ సిమ్ ఎప్పుడు తీసుకోవాలి..?

మీమీ పట్టణాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్‌ లాంచ్ తేదీలను ప్రకటించిన తరువాత మీ ఫోటో ఐడీతో పాటు సంబంధిత డాక్యుమెంట్‌లతో బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లినట్లయితే 4జీ సిమ్ మీకు లభిస్తుంది. మీరు వాడుతోన్నది లేటెస్ట్ 3జీ సిమ్ అయినట్లయితే 4జీకి కన్వర్ట్ చేసుకునే అవకాశముంటుంది. 3జీ సిమ్ యూజర్లు 1900కు PORT మెసేజ్ చేయటం ద్వారా 4జీ నెట్‌వర్క్‌లోకి కన్వర్ట్ కావొచ్చు.

www.bsnl.co.inలో చెక్ చేసుకోండి....

బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ఆఫర్ చేసే ప్రీపెయిడ్ అలానే పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ జియోకు ధీటుగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బీఎస్ఎన్ఎల్ 4జీ ప్లాన్‌లకు సంబంధించిన ఏ విధమైన వివరాలను www.bsnl.co.in వెబ్‌సైట్‌లో బీఎస్ఎన్ఎల్ పొందుపరచలేదు.

బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉండే ప్రాంతాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, జార్కండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Now Said to Roll Out 4G Services by December 2017: Report. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot