30జీబి డేటా, నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అందిస్తోన్న కొన్ని పోస్ట్ పెయిడ్ టారిఫ్ ప్లాన్‌లలో భారీ మార్పులను చేయబోతున్నట్లు సమాచారం. మార్పు చేర్పులతో కూడిన కొత్త ప్లాన్‌లు జూన్ 1, 2017 నుంచి Pan ఇండియా మొత్తం అందుబాటులో ఉంటాయట. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

30జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, 250 ఎస్ఎంస్‌లు

Keralatelecom.info వెల్లడించిన వివరాల ప్రకారం రూ.1125 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో భాగంగా ఇక పై 20 జీబి డేటా లభించనుంది. గతంలో ఈ ప్లాన్ క్రింద 10జీబి డేటా మాత్రమే లభించేది. మరో ప్లాన్ రూ.1525లో భాగంగా 30జీబి డేటా వర్తిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 250 ఎస్ఎంస్‌లు అందుబాటులో ఉంటాయి.

BSNL 4జీ ఎప్పుడు..?

4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్ధ బీఎస్ఎన్ఎల్ (BSNL)ఎంపిక చేసిన ప్రాంతాల్లో, తన 2జీ సెల్ సైట్‌లను లేటెస్ట్ సెల్ సైట్‌లతో అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్‌గ్రేడ్ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోయే 3జీ, 4జీ సర్వీసులు మరింత క్వాలిటీని సంతరించుకుని ఉంటాయి.

ఫేజ్ - 8 విస్తరణలో భాగంగా

 దేశవ్యాప్తంగా 28,000 కొత్త మొబైల్ బేస్ స్టేషన్ లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయబోతున్నట్లు పీటీఐ తెలిపింది. భారత్‌లో 4జీ LTE సర్వీసులను అందించేందుకు 3జీ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే అంశం పై సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ పరిశీలిస్తోంది.

కొత్త యూజర్ల తాకిడి పెరుగుతోంది

ప్రయివేటు ఆపరేటర్లకు పోటీగా అన్‌లిమిటెడ్ ఆఫర్‌లను లాంచ్ చేసి టెలికం సర్కిల్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచిన బీఎస్ఎన్ఎల్‌కు కొత్త యూజర్ల తాకిడి పెరుగుతోంది.

నెలలో 29.5 లక్షల కొత్త ప్రీపెయిడ్ కనెక్షన్‌లు

బీఎస్ఎన్ఎల్‌కు ఒక్క మార్చి నెలలోనే 29.5 లక్షల కొత్త ప్రీపెయిడ్ కనెక్షన్‌లను రాబట్టుకోగలిగినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అనుకున్న టార్గెట్ కంటే 2.5 లక్షల కనెక్షన్‌లను ఎక్కువుగా రాబట్టటంతో మార్కెట్ పై బీఎస్ఎన్ఎల్‌ మరింతగా దృష్టిసారించబోతున్నట్లు సమాచారం.

మార్చి, 2017కుగాను..

మార్చి, 2017కుగాను 2.7 మిలియన్ ప్రీపెయిడ్ కనెక్షన్‌లను రాబట్టే క్రమంలో ఒక్కో సర్కిల్‌కు ఒక్కో టార్గెట్‌ను బీఎస్ఎన్ఎల్ నిర్థేశించుచుకుంది. 22 సర్కిళ్లకు గాను 18 సర్కిళ్లలో తన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

18 సర్కిళ్లలో టార్గెట్ రీచ్..

అండమాన్ నికోబార్, అస్సాం, జార్ఖండ్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ), ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్), ఉత్తరాంచల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సర్కిళ్లలో నిర్థేశించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో కనెక్షన్‌లను బీఎస్ఎన్ఎల్ రాబట్టగలిగింది.

ఈ ప్రాంతాల్లో మరంత ఫోకస్ అవసరం..

ఆంధ్రప్రదేశ్, చెన్నై, బిహార్, జమ్ము అండ్ కాశ్మీర్ ఇంకా నార్త్ ఈస్ట్ - II సర్కిళ్లలో మాత్రం అనుకున్న కొత్త కనెక్షన్‌లను బీఎస్ఎన్ఎల్ రాబట్టలేకపోయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to Offer 20GB and 30GB Data With the Rs. 1125 and Rs. 1525 Postpaid Plans From June 1, 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot