1,000 mbps స్పీడ్‌తో BSNL ఆల్ట్రా ఫాస్ట్
జియోతో పోటీ పడేందుకు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ రెడీ అయింది.
జియోతో పోటీ పడేందుకు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ రెడీ అయింది. జియో నుంచి త్వరలో పైబర్ బ్రాండ్ వస్తున్న నేపథ్యంలో తన స్పీడ్ ను పెంచుకునేందుకు జియో కసరత్తు చేస్తోంది.ఇందుకోసం తాజాగా అల్ట్రా-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ఆవిష్కరించింది. దీని కోసం సంస్థ తన నెట్‌వర్క్‌ను నెక్స్ట్ జనరేషన్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసుకుంది.

1జీబీపీఎస్ టాప్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో
ఈ సర్వీసు ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ 1జీబీపీఎస్ టాప్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది.

సెకన్‌కు 100 ఎంబీ
ప్రస్తుతం కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవల టాప్ డౌన్‌లోడ్ స్పీడ్ సెకన్‌కు 100 ఎంబీగా ఉంది.

44 పట్టణాల్లో విజయవంతం
నెక్స్ట్ జనరేషన్ ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ (ఎన్‌జీ-వోటీఎన్) ప్రాజెక్టును బీఎస్‌ఎన్‌ఎల్ 44 పట్టణాల్లో విజయవంతంగా అమలు చేసింది.

100 ప్రధాన పట్ట్టణాలకు
సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో ఈ పథకం కింద రాష్ట్రాల రాజధానులు సహా 100 ప్రధాన పట్ట్టణాలకు ఈ సేవలను విస్తరించనుంది' అని టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.

రూ.330 కోట్ల పెట్టుబడులతో
రూ.330 కోట్ల పెట్టుబడులతో ఎన్‌జీ-వోటీఎన్ ప్రాజెక్టు అమలు 3 దశల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








