బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్, యూజర్లకు 6 రెట్లు ఎక్కువ డేటా

60 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 3G డేటా..

By Ssn Sravanth Guthi
|

ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్(BSNL), జియోకు పోటీగా పాన్ ఇండియా అంతటా సరికొత్త ఆఫర్లను రంగంలోకి దింపింది. ఈ కొత్త ప్లాన్‌లలో భాగంగా బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ యూజర్లు తమ ప్లాన్‌ల పై ఆరు రెట్ల ఎక్కువ డేటాను పొందే వీలుంటుంది.

డబ్బు విలువకు తగ్గట్టుగా ప్లాన్స్...

డబ్బు విలువకు తగ్గట్టుగా ప్లాన్స్...

"మేము మా విశ్వసనీయమైన మొబైల్ వినియోగదారులకు, సరసమైన ఇంకా సమర్థవంతమైన సేవలను అందించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాం. ప్రస్తుత భారత టెలికాం రంగంలోని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని డబ్బు విలువకు సమానమైన ప్లాన్స్‌ని అందిస్తున్నామని" ఆ సంస్థ బోర్డు డైరెక్టర్ ఆర్.కె.మ్మిట్టల్ (R K Mittal) ఒక ప్రకటనలో తెలిపారు.

బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను పరిశీలించినట్లయితే

బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను పరిశీలించినట్లయితే

రూ.99 ప్లాన్ క్రింద ఉన్న వినియోగదారులు గతంలో ఎటువంటి డేటా‌ని పొందెవారు కాదు, తాజా రివిజన్ నేపథ్యంలో ఈ ప్లాన్‌లో ఉన్న వారికి 250 MB డేటా లభిస్తోంది.

 

పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ల పై రెట్టింపు డేటా..
 

పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ల పై రెట్టింపు డేటా..

అలాగే పోస్ట్ పెయిడ్ కస్టమర్లు రూ.225 ప్లాన్‌‌కు గాను 200 MB‌కి బదులుగా 1GB డేటాను, రూ.325 ప్లాన్‌‌కు గాను 250 MBకి బదులుగా 2GB డేటాను, రూ. 525 ప్లాన్‌‌కు గాను 500 MBకి బదులుగా 3GB డేటాను, రూ. 725 ప్లాన్‌‌కు గాను 1GBకి బదులుగా 5GB డేటాను, రూ. 799 ప్లాన్‌‌కు గాను 3GB కి బదులుగా 10GB డేటాను పొందవచ్చు.

బీఎస్ఎన్ఎల్ సిక్సర్

బీఎస్ఎన్ఎల్ సిక్సర్

ఈ కంపెనీ కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిక్సర్ - 666 ప్లాన్‌ని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ ప్రీ-పెయిడ్ యూజర్లకు 60 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి చొప్పున 3G డేటా అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
State owned telecom operator Bharat Sanchar Nigam Limited (BSNL) has decided to offer up to six times more data on existing postpaid plans services with effect from 01.07.2017 on PAN India basis.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X