రూ.1.42 ధరకే 1GB డేటాను అందిస్తున్న BSNL!! ప్రైవేట్ టెల్కోల కంటే మూడు రేట్లు ఎక్కువ

|

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు 1GB డేటాను కేవలం 1.42 రూపాయలకు మాత్రమే అందిస్తోంది. ప్రైవేట్ టెల్కోలు రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ వంటి ఇతర ఆపరేటర్లు తమ యొక్క దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లతో దీని కంటే అధిక రేట్ల వద్ద డేటాను అందిస్తున్నాయి. కానీ BSNL ఒక అడుగు ముందుకు వేసి భారతదేశంలో చౌకైన ధరకే డేటాను తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తోంది. అయితే ఇది రూ.1.42 కి కొనుగోలు చేయగల స్వతంత్ర డేటా వోచర్ కాదని గమనించండి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.1.42లకే 1GB డేటాను అందిస్తున్న BSNL

రూ.1.42లకే 1GB డేటాను అందిస్తున్న BSNL

BSNL టెల్కో తన వినియోగదారులకు రూ.599 ధర వద్ద 'STV_WFH_599' పేరుతో ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను అందిస్తుంది. ఇది వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అంటే ఈ ప్లాన్ వినియోగదారులకు మొత్తం చెల్లుబాటు కాలానికి 420GB డేటాను అందిస్తుంది.

VI కొత్త REDX మల్టీ-మెంబర్ ప్లాన్‌లు & యాడ్-ఆన్ లపై టారిఫ్ పెంపు!!VI కొత్త REDX మల్టీ-మెంబర్ ప్లాన్‌లు & యాడ్-ఆన్ లపై టారిఫ్ పెంపు!!

ప్రైవేట్ కంపెనీలు

ఇతర ప్రైవేట్ కంపెనీలు ఏవీ కూడా 84 రోజుల వాలిడిటీ కాలంలో వినియోగదారులకు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఇంత మొత్తంలో డేటాను అందించవు. ముఖ్యంగా ఈ ప్లాన్‌తో వినియోగదారుడు వినియోగించే ప్రతి GB డేటాకు రూ.1.42 మాత్రమే ఖర్చు అవుతుంది. జింగ్ యొక్క ప్రయోజనం కూడా ఉచితంగా వినియోగదారులకు అందించబడుతుంది.

యాడ్-ఆన్ డేటా వోచర్‌

అధిక మొత్తంలో డేటాను వినియోగించే వారికి ఇంత ఎక్కువ డేటా కూడా తక్కువగా ఉంటే మీరు కంపెనీ నుండి రూ.251 ధర వద్ద లభించే యాడ్-ఆన్ డేటా వోచర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ వోచర్‌ను 'DATA_WFH_251' పేరుతో పిలుస్తారు. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలానికి ఉచిత జింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 70GB డేటా ప్రయోజనంను వినియోగదారులకు అందిస్తుంది. ఈ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌తో వినియోగదారులు 1GB డేటాను రూ.3.58 ధర వద్ద పొందుతారు. ఇది టెల్కో యొక్క రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు పొందే డేటా ధర కంటే రెండింతలు.

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడంలో ఒక లోపం ఉంది. వినియోగదారులు ఇండియా మొత్తంగా 4G కనెక్టివిటీని పొందలేరు. అలాగే 3G నెట్‌వర్క్ కూడా ఆశించినంత మెరుగ్గా లభించదు. BSNL యొక్క 4G నెట్‌వర్క్ చాలా బలంగా ఉన్న జోన్‌లో ఎక్కువ ప్రయాణించని మరియు నివసించే వారికి ఈ ప్లాన్ అర్ధమే.

ప్రీపెయిడ్ ప్లాన్

టెలికాం మార్కెట్‌లో మరే ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ ఏ విధమైన వ్యవధిలోనూ వినియోగదారులకు 5GB రోజువారీ డేటాను అందించదు. BSNL ఏకైక టెల్కో మాత్రమే ఇంత మొత్తంలో డేటాను అందిస్తుంది. కానీ దానితో సంబంధం లేకుండా టెల్కో కస్టమర్లను కోల్పోతోంది. ప్రభుత్వరంగ టెలికాం తన నెట్‌వర్క్‌ను దూకుడుగా మెరుగుపరచగలిగితే అది తన చందాదారుల మార్కెట్ వాటాను స్వల్ప వ్యవధిలో నాటకీయంగా మెరుగుపరచగలదు.

Best Mobiles in India

English summary
BSNL Offering 1GB Mobile Data Just Rs.1.42 Only!! Three Times Higher Than Private Telcos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X