BSNL FTTH ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై ఉచితంగా 4 నెలల సర్వీసులు!! అయితే

|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రభుత్వ టెలికాం సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా తన యొక్క సత్తాను ముందు నుంచి చూపుతున్నది. ఇండియాలో ప్రస్తుత రోజులలో మారుమూల ప్రాంతాలలో కూడా తన యొక్క సేవలను అందిస్తున్నది. ఈ సంస్థ ఇప్పుడు తన యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు నాలుగు నెలల వరకు ఉచిత సేవలను అందిస్తోంది.

 

BSNL FTTH సేవలు

BSNL FTTH సేవలు

భారతదేశం నలుమూలలా ఉన్న వినియోగదారులకు DSL మరియు FTTH సేవలను అందిస్తుంది. వినియోగదారులు 36 నెలలు (3 సంవత్సరాలు) ముందుగానే చెల్లిస్తే వారికి ఈ నాలుగు నెలల ఉచిత సేవను అందిస్తామని BSNL ప్రకటించింది. అందువలన 36 నెలలు చెల్లించిన తర్వాత వినియోగదారులకు 40 నెలల వరకు ఈ సర్వీసును పొందే అర్హత ఉంటుంది. అయితే 24 నెలలు (2 సంవత్సరాలు) కాలానికి చెల్లించే వినియోగదారుల కోసం ఈ సంస్థ 3 నెలల అదనపు సర్వీసులను ఉచితంగా అందిస్తుంది. చివరగా 12 నెలలు లేదా 1 సంవత్సరం కాలానికి చెల్లించిన కస్టమర్లకు 1 నెల అదనపు సేవలు ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా BSNL తన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను క్రమబద్ధీకరించింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

<strong>ఎయిర్‌టెల్-అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఆఫర్ గురించి మీకు తెలియని విషయాలు</strong>ఎయిర్‌టెల్-అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఆఫర్ గురించి మీకు తెలియని విషయాలు

BSNL క్రమబద్ధీకరించిన FTTH ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
 

BSNL క్రమబద్ధీకరించిన FTTH ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

BSNL ప్రచార ఆఫర్‌లను ప్రారంభించడానికి/ప్రకటించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రచార ఆఫర్‌లతో ఉన్న విషయం ఏమిటంటే వారికి గడువు తేదీ ఉంటుంది. కానీ క్రమబద్ధీకరించిన ప్లాన్‌లు కాదు. అయితే ఇప్పుడు టెల్కో నుండి వీటిని పర్మినెంట్ చేయబడింది. BSNL యొక్క రూ.449 ప్లాన్, రూ.779 ప్లాన్, రూ.999 మరియు రూ.1499 ప్లాన్ సహా అన్ని ప్రధాన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇప్పుడు క్రమబద్ధీకరించబడ్డాయి. అంటే కస్టమర్లు తమకు కావలసినప్పుడు రూ.449 ప్లాన్‌ను ఎంచుకొని ఉపయోగించుకోవచ్చు. అందుకే ఈ ప్లాన్లతో కస్టమర్లకు కంపెనీ దీర్ఘకాలిక కొనుగోలు ఆఫర్లను కూడా అందిస్తోంది.

BSNL భారత్ ఫైబర్

BSNL భారత్ ఫైబర్ కొన్ని పోటీతత్వ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కలిగి ఉంది. BSNL తన హై-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో మరిన్ని ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను అందించడంలో ముందుంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్‌తో సహా టెల్కో పోటీదారులు ప్రీమియం రేంజ్‌లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో టన్నుల OTT ప్రయోజనాలను అందిస్తారు. భవిష్యత్తులో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అవసరాలు పెరగనున్నందున ఇది టెల్కో నుండి మంచి ఎత్తుగడ కావచ్చు.

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లతో వినియోగదారులు ఎలాంటి ప్రమోషనల్ వాలిడిటీ లేకుండా తమకు ఆసక్తి ఉన్న ప్లాన్‌లను ఎంచుకోగలుగుతారు. ముఖ్యంగా సూపర్ స్టార్ ప్రీమియం -1 ప్లాన్ 100 Mbps వేగంతో 1000GB వరకు డేటాను అందిస్తుంది. FUP డేటా పరిమితి దాటిన తరువాత డేటా వేగం 5 Mbps కి పడిపోతుంది. మరోవైపు సూపర్‌స్టార్ ప్రీమియం-2 ప్లాన్ 150 Mbps వేగంతో 2000GB వరకు FUP డేటాను అందిస్తుంది. ఈ FUP పరిమితిని పూర్తి చేసిన తరువాత డేటా వేగం 10 Mbps కి పడిపోతుంది. BSNL FTTH యొక్క ఈ కొత్త ప్లాన్‌లలో సూపర్‌స్టార్ ప్రీమియం -1 ప్లాన్ యొక్క ధర రూ.749 కాగా సూపర్‌స్టార్ ప్రీమియం -2 FTTH ప్లాన్ ధర రూ.949. ఈ ప్లాన్‌లలోని ఇతర అంశాల విషయానికి వస్తే ఒక నెల సెక్యూరిటీ డిపాజిట్, కనీస అద్దె వ్యవధి ఒక నెల మరియు టెలిఫోన్ స్థిర నెలవారీ ఛార్జీలు లేవు. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది.

BSNL Cinamplus

BSNL FTTH కొత్త ప్లాన్‌లను ఎంచుకునే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా Yupp TV మరియు BSNL Cinamplus సేవలకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్‌లతో పాటుగా ఉచిత యాక్సిస్ లభిస్తున్న ఇతర OTT సబ్‌స్క్రిప్షన్‌లలో సోనీ లివ్ ప్రీమియం, ZEE5 ప్రీమియం మరియు వోట్ సెలెక్ట్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా Yupp TV లైవ్ టీవీ ఛానెల్‌లు, వెబ్ సిరీస్‌లు, ప్రీమియం టీవీ ఛానెల్‌లు మరియు తాజా సినిమాలను కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లతో OTT సేవలను అందించడానికి అండమాన్ మరియు నికోబార్ సర్కిల్ మినహా అన్ని సర్కిళ్లలోని వినియోగదారుల కోసం ఈ కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని అధికారికంగా నిర్ణయించింది. చందాదారులు ఈ ప్లాన్‌లను ఎంచుకున్న వెంటనే బండిల్డ్ OTT సబ్‌స్క్రిప్షన్ నిలిపివేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందం ప్రకారం Yupp TV యొక్క చెల్లుబాటు మార్చి 31, 2022 కాబట్టి బండిల్ ఆఫర్ సర్వీస్ ప్రొవైడర్‌తో కంపెనీ ఒప్పందం గడువు ముగిసే వరకు చెల్లుతుంది.

Best Mobiles in India

English summary
BSNL Offering 4 Months Free Service on BSNL FTTH Bharat Fibre Broadband plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X