ఏ కనెక్షన్ తీసుకున్నా మొదటి నెల ఉచితం

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త స్కీమ్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌లను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఒకనెల ఉచిత సర్వీసును ఆఫర్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏ కనెక్షన్‌ తీసుకున్నా...

బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, FTTH, బ్రాడ్‌బ్యాండ్ ఇలా ఏ కనెక్షన్‌ను తీసుకున్నా ఒక నెలపాటు ఉచిత సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ఈ సమాచారాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా మరింత మంది కస్టమర్‌లకు చేరువకావాలని టెల్కో భావిస్తోంది.

ప్రాసెస్ ఇది...

సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌లను తీసుకునే యూజర్ సంబంధిత లింక్‌లోకి వెళ్లి తన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ ఇంకా అకౌండ్ ఐడీ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. వివరాలను సబ్మిట్ చేసిన వెంటనే బీఎస్ఎన్ఎల్ అధికారి మిమ్మల్ని సంప్రదిస్తారు. పాన్-ఇండియా మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

రూ.444 చౌకా ప్లాన్ మార్కెట్లో సంచలనం

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల లాంచ్ చేసిన రూ.444 చౌకా ప్లాన్ మార్కెట్లో సంచలనం రేపుతోంది. ఈ ప్లాన్ ఇతర టెల్కోలకు చుక్కులు చూపించేలా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో లాంచ్ చేసిన బెస్ట్ డేటా సెంట్రిక్ ప్లాన్‌లలో చౌకా ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రోజుకు 4జీబి డేటా...

మార్కెట్లో ఇతర టెలికం ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్నఇతర డేటా సెంట్రిక్ ప్లాన్లను పరిశీలించినట్లయితే నెలకు రూ.350 నుంచి రూ.450 మధ్య చెల్లిస్తేగాని రోజుకు 1జీబి డేటా లభించేలా లేదు. అయితే, బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న చౌకా ప్లాన్ లో మాత్రం రూ.444 చెల్లించినట్లయితే రోజుకు 4జీబి 3జీ డేటా అందుబాటులో ఉంటుంది.

ప్లాన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు..?

రూ.444 చెల్లించి చౌకా ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఏకంగా 90 రోజుల పాటు ప్లాన్ బెనిఫిట్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది. అంటే 90 రోజుల పాటు రోజుకు 4జీబి చొప్పున 3జీ డేటాను పొందే వీలుంటుంది.

వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు..

బీఎస్ఎన్ఎల్ రూ.444 చౌకా ప్లాన్‌లో ఎటువంటి వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. ఇది కేవలం డేటా సెంట్రిక్ ప్లాన్ మాత్రమే. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న STV 339, STV 395 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకున్నట్లయితే డేటా అలానే వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ 30 అలానే 71 రోజుల వ్యాలిడిటీలతో అందుబాటులో ఉంటాయి.

బెస్ట్ డేటా ప్లాన్ ఇదే...

ఇప్పటి వరకు టెలికం మార్కెట్లో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న రూ.333 ట్రిపుల్ ఏస్ ప్లాన్ బెస్ట్ ప్లాన్‌గా ఉండేది. తాజాగా ఆ స్థానాన్ని రూ.444 చౌకా ప్లాన్ ఆక్రమించేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Offering One Month of Free Landline/FTTH/Broadband Service. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting