జియోకి మైండ్ బ్లాక్ : 1+1 ఆఫర్‌తో దడ పుట్టిస్తున్న BSNL

Written By:

ప్రైవేటు రంగ టెలికం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే దిశగా ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ అడుగులు వేస్తోంది.జియో దెబ్బకు అన్ని టెల్కోలు భారీ నష్టాలను మూటగట్టుకున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ నీకు నేనే సరైన ప్రత్యర్థి అంటూ సవాల్ విసురుతోంది. ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ తో జియోకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ ప్లాన్ విశేషాలేంటో చూద్దాం.

రూపాయికే రెడ్‌మి ఫోన్లు: ఆఫర్ మూడు రోజులే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాలుగు '1+1' ఆఫర్లను

ఈ పండగ సీజన్ లో ఎస్టీవీ (స్పెషల్ టారిఫ్ ఓచర్)ల ద్వారా రీచార్జ్ చేసుకునే ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ నాలుగు '1+1' ఆఫర్లను ప్రకటించింది.

రెట్టింపు డేటా

ఈ నాలుగు ఓచర్ రీజార్జ్ ల ద్వారా రెట్టింపు డేటాను అందుకోవచ్చని, ఏడాది పాటు ఈ డేటా చెల్లుబాటవుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్టోబర్ 10 నుంచి 31 వరకూ

ఈ డబుల్ డేటా ప్లాన్ అక్టోబర్ 10 నుంచి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. డబుల్ డేటా బెన్‌ఫిట్స్ పొందేలా నాలుగు స్పెషల్ టారిఫ్ ఓచర్ ప్లాన్స్ కింది విధంగా ఉన్నాయి.

1,498 రూపాయలతో

1,498 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మామూలుగా అయితే 9 జీబీ డేటా లభిస్తుంది. కానీ అదే ప్లాన్‌ను ఈ పరిమిత రోజుల్లో రీఛార్జ్ చేసుకుంటే 18 జీబీ డేటా అంటే డబుల్ డేటా లభిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2,798 రూపాయలతో

2,798 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే లభించే 18 జీబీ డేటాను 36 జీబీకి పెంచారు.

3,998 రూపాయలకు

3,998 రూపాయలకు లభించే 30జీబీ డేటాను 60జీబీకి పెంచారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4,498 రూపాయలతో

4,498 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే పొందే 40జీబీ డేటాను 80జీబీకి పెంచారు.

మరింత డేటాను అందించాలన్న లక్ష్యంతోనే

కస్టమర్లకు మరింత డేటాను అందించాలన్న లక్ష్యంతోనే ఈ ప్యాక్ లను అందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్ కే మిట్టల్ ఈ ప్రకటనలో తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
BSNL offers '1 + 1 free data' for prepaid subscribers Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot