రోజుకు 10జీబి డేటా, BSNL సంచలనం
రిలయన్స్ జియోకు మరో షాక్..
దేశవ్యాప్తంగా తన వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరో అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది.
Read More : Redmi Note 4 బుకింగ్స్ ప్రారంభం

'Experience Unlimited BB 249'
'Experience Unlimited BB 249' పేరుతో లాంచ్ అయిన ఈ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ యూజర్ నెలవారీ ఛార్జీ క్రింద రూ.249 చెల్లించినట్లయితే రోజుకు 10జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

2 Mbps వేగంతో..
2 Mbps వేగంతో ఈ డేటా లభిస్తుంది. ఈ ఫ్లాన్‌లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఆదివారాలు కాల్స్ మొత్తం ఉచితం.

రూ.339 రీచార్జ్ ప్లాన్, రోజుకు 2జీబి డేటా..
రిలయన్స్ జియోకు షాకిస్తూ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ఆఫర్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.339 రీచార్జ్ ప్లాన్‌ను పొందటం ద్వారా 28 రోజుల పాటు ( బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్) అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 3జీ డేటాను పొందవచ్చు.

90 రోజుల ప్లాన్..
90 రోజుల పాటు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అంటే మూడు సార్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో డేటా ఎక్కువగానే లభిస్తున్నప్పటికి అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలోనే ఉండటం కొంత మేర నిరుత్సాహపరిచే విధంగా ఉంది.


Click it and Unblock the Notifications