బీఎన్‌ఎన్‌ఎల్ రూ.399 ప్లాన్ లో భారీ మార్పులు..ఓ సారి చెక్ చేసుకోండి
దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం ఒక్కసారిగా అనేక కుదుపులకు కారణం అయింది.
దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం ఒక్కసారిగా అనేక కుదుపులకు కారణం అయింది. అలాగే అనేక సంచలనాల ఫలితాలు నమోదయ్యాయి. డేటా ధరలు అప్పటివరకు ఆకాశంలో ఉంటే జియో వచ్చిన తరువాత నేల చూపులు చూశాయి. ముఖ్యంగా జియో ఉచిత డేటాతో ఓ సునామినే తలపించింది. దాని దెబ్బకు దిగ్గజ టెల్కోలు కూడా తమ డేటా ధరలను భారీగా తగ్గిస్తూ వస్తున్నాయి. తమ పాత ప్లాన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎన్‌ఎన్‌ఎల్) తన రూ.399 ప్లాన్ లో మార్పులు చేసింది.

రూ.399
రూ.399తో రీచార్జ్ చేసుకుంటే 74 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వినియోగించుకోవచ్చు.డేటా పరిమితి దాటిన తర్వాత 80 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. ఇక ప్రతిరో

గతంలో రూ.399 ప్లాన్ లో
గతంలో రూ.399 ప్లాన్ లో కేవలం రోజుకి 1జీబీ డేటా మాత్రమే లభించేది.అయితే బీఎన్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్ ను మార్పు చేయడం వలన రోజుకి 3జీబీ డేటా లభిస్తుంది. అంటే యూజర్ మొత్తంగా 222జీబీ డేటా పొందవచ్చు.

బీఎన్‌ఎన్‌ఎల్ రూ.399 ప్లాన్ vs జియో రూ.399 ప్లాన్
ఇదే తరహా ప్లాన్ జియోలో కూడా లభిస్తోంది. జియో రూ.399 ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు అలాగే రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తాయి.ఈ ప్లాన్ వల్ల జియో యూజర్లకు మరికొన్ని లాభాలు ఉన్నాయి. ఈ ప్లాన్ ను రేచర్గే చేసుకున్న జియో యూజర్ కి Jio Suite apps ను ఫ్రీ గ యాక్సిస్ చేసుకోవచ్చు.

బీఎన్‌ఎన్‌ఎల్ లేటెస్ట్ గా రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను లాంచ్ చేసింది
ఈ రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది.రోజు వారి డేటా ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 8 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 1 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








