రూ.16లకే మంత్లీ వాలిడిటీ ప్లాన్‌ను అందిస్తూ ప్రైవేట్ టెల్కోలకు సవాల్ విసిరిన BSNL

|

ఇండియాలోని టెలికాం రంగంలో మొదటి నుంచి ఉన్న ఏకైక సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ముందు నుంచి కూడా తన యొక్క వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. మునుపు సిమ్ యాక్టీవ్ లో ఉంచడం కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవలసిన అవసరం లేదు. అలాగే ఎవరికైనా ఫోన్ కాల్స్ చేయాలనీ అనుకుంటే అంత రీఛార్జ్ చేస్తూ ఉండేవారు. ఇది ఎక్కువ సమయం ఫోన్ కాల్స్ చేసే వారికి ఇబ్బంది ఉండడంతో తరువాత అపరిమిత వాయిస్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి రాకతో అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత SMS మరియు అధిక డేటా ప్రయోజనాలు అధికమయ్యాయి.

 

BSNL

అయితే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సిమ్ లను వాడుతూ కొన్ని సిమ్ లను కేవలం వాయిస్ కాల్స్ కోసం వినియోగించే వారు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి రీఛార్జ్ చేయడానికి ఇష్టపడరు. ఇటువంటి వారి కోసం టెల్కోలు అన్ని కూడా ఇప్పుడు అత్యంత సరసమైన ధరలోనే 30-రోజుల వాలిడిటీతో కొత్తగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే BSNL మాత్రం మిగిలిన వారికి బిన్నంగా కేవలం రూ.16 వద్దనే ఒక ప్లాన్ ను అందిస్తున్నది. ఇది మొత్తం 30 క్యాలెండర్ రోజుల చెల్లుబాటుతో అందించబడుతుంది. ఈ ప్లాన్‌లో SMS మరియు డేటా ప్రయోజనాలను అందించదు. BSNL వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఈ ప్లాన్‌ "20 పైసలు/నిమి ఆన్-నెట్ కాల్‌లు + 20 పైసలు/నిమిషానికి ఆఫ్-నెట్ కాల్స్" ఛార్జ్ చేయబడుతుందని పేర్కొంది. మీరు మీ BSNL SIMని యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే కనుక ఈ వాయిస్ వోచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 30 రోజుల మంత్లీ వాలిడిటీ కేటగిరీలో BSNL నుండి లభించే మరిన్ని ప్లాన్‌ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Jio, Airtel, Vi, BSNL: 1నెల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఏవి?Jio, Airtel, Vi, BSNL: 1నెల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఏవి?

BSNL STV_147 వోచర్
 

BSNL STV_147 వోచర్

BSNL నుండి 30 రోజుల చెల్లుబాటుతో కొత్తగా విడుదలైన ప్రీపెయిడ్ వోచర్ ప్లాన్ STV_147. ఇది రూ.147 ధర వద్ద లభిస్తూ వినియోగదారులకు డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను రెండింటినీ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం వాలిడిటీ కాలంలో 10GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. అదనంగా BSNL ట్యూన్స్ సదుపాయం కూడా లభిస్తుంది. వినియోగదారులు గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే ఈ ప్లాన్‌లో SMS ప్రయోజనాలు ఏవీ చేర్చబడలేదు.

BSNL STV_247

BSNL STV_247

30 రోజుల చెల్లుబాటుతో లభించే కొత్త ప్లాన్ల విభాగంలోని మరొక ప్లాన్ STV_247. ఇది రూ.247 ధర వద్ద లభిస్తుంది. STV_147 ప్లాన్ కంటే మీరు కొంచెం ఎక్కువ చెల్లించగలిగితే కనుక మీరు అధిక మొత్తంలో డేటాను పొందవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ వినియోగదారులకు SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. STV_247 వోచర్ ను ఎంచుకున్న వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు మొత్తం వాలిడిటీ కాలానికి 50GB డేటాను మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. వీటితో పాటుగా అదనంగా BSNL ట్యూన్స్ మరియు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను కూడా పొందుతారు.

BSNL STV_299

BSNL STV_299

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) నుండి 30 రోజుల వాలిడిటీతో మీరు పొందగలిగే మరో ఉత్తేజకరమైన టారిఫ్ వోచర్ STV_299. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. FUP డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి పడిపోతుంది.

BSNL రూ.797 వోచర్ ప్లాన్

BSNL రూ.797 వోచర్ ప్లాన్

BSNL టెల్కో రూ.797 ధర వద్ద అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాలలో మొదటి 60 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలు అందించబడుతుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbpsకి తగ్గించబడుతుంది. 60 రోజుల తర్వాత ప్రయోజనాల గడువు ముగుస్తుంది కానీ SIM కార్డ్ సంవత్సరం పొడవునా యాక్టీవ్ దశలో ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క సాధారణ వాలిడిటీ 395 రోజులు. అయితే జూన్ 12, 2022 లోపు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు BSNL ఈ ప్లాన్‌తో 30 రోజుల అదనపు చెల్లుబాటును కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Offers 30 Days Validity Prepaid Plan at Just Rs.16: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X