Home
News

425 రోజుల వ్యాలిడిటీ, 850GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో BSNL రీఛార్జ్‌ ప్లాన్‌.. పూర్తి ప్రయోజనాలు..!

BSNL ప్రస్తుతం ప్రైవేటు టెలికాం సంస్థలకు గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ సంవత్సరం జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో గతానికి భిన్నంగా లక్షల మంది యూజర్లను BSNL సంపాదించుకుంటోంది. అదే సమయంలో ప్రైవేటు టెలికం సంస్థలు భారీగా యూజర్లను కోల్పోయాయి. అయితే BSNL ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ లను విడుదల చేస్తోంది.

జనవరి 16 వరకు మాత్రమే :
మూడు రోజుల క్రితం బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.277 రీఛార్జ్ ప్లాన్‌ ను (BSNL Rs277 Recharge Plan) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ను లిమిటెడ్‌ టైం ప్లాన్‌ గా విడుదల చేసింది. జనవరి 16 వరకు మాత్రమే ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌ లో భాగంగా ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు కాలింగ్, SMS సదుపాయాలను కూడా పొందవచ్చు.

BSNL Offers 425 Validity with Rs2399 Prepaid Recharge Plan full benefits

425 రోజుల వ్యాలిడిటీతో BSNL రీఛార్జ్ ప్లాన్‌ :
BSNL రూ.2500 కంటే తక్కువ ధరలో ఏకంగా 425 రోజుల వ్యాలిటిడీ ప్లాన్‌ను అందుబాటులోకి (425 Days Validity BSNL Recharge Plan) తీసుకొచ్చింది. కాలింగ్‌, డేటా, SMS ప్రయోజనాలను అందిస్తోంది. అదే ప్రైవేటు టెలికం సంస్థలు సంవత్సరం వ్యాలిడిటీ ప్లాన్‌ కోసం రూ.3500 నుంచి రూ.4000 వరకు వసూలు చేస్తున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,399 రీఛార్జ్‌ ప్లాన్‌ తో ఏకంగా 425 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో (BSNL Rs2399 Prepaid Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు.

రోజువారీ 2GB డేటా వినియోగం అనంతరం డేటా వేగం 40kbps గా ఉంటుంది. అయితే మొత్తం ప్లాన్‌ వ్యాలిడిటీలో ఏకంగా 850GB డేటాను పొందవచ్చు. ప్రైవేటు టెలికాం సంస్థలు గరిష్ఠంగా 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లను మాత్రమే అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఏకంగా 425 వ్యాలిడిటీని అందించే రీఛార్జ్‌ ప్లాన్‌ ను కలిగి ఉంది.

రూ.2,999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ :
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని (BSNL 365 Days Validity Recharge Plan) అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు డేటా పరంగా రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా అనంతరం డేటా స్పీడ్‌ 40kbps గా ఉండనుంది.

ఏకంగా 600GB డేటా :
దీంతోపాటు రూ.1999 రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏకంగా 600GB డేటాను అందిస్తోంది. అయితే ఈ డేటాపై రోజువారీగా ఎటువంటి పరిమితి ఉండదు. అయితే ఈ డేటా వినియోగం అనంతరం డేటా వేగం 40kbps గా ఉంటుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Offers 425 Validity with Rs2399 Prepaid Recharge Plan full benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X