రూ.444 చెల్లిస్తే 90 రోజుల పాటు రోజుకు 4జీబి డేటా
బీఎస్ఎన్ఎల్ తన కొత్త ఆఫర్‌తో మరోసారి పంజావిసిరింది...
ప్రయివేట్ టెల్కోలకు ధీటుగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సంచలన ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ క్రింద బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.444 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 90 రోజుల పాటు రోజుకు 4జీబి చొప్పున 3జీ డేటా అందుబాటులో ఉంటుంది.

''BSNL CHAUKKA'' పేరుతో ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ క్రింద లభించే ఒక్కో జీబి డేటా ఖరీదు రూపాయి కన్నా తక్కువేనని బీఎస్ఎన్‌ఎల్ తెలపింది. ఇతర టెలికమ్ ఆపరేటర్లు తమ ఆఫర్లను కొద్దొకొద్దిగా తగ్గించుకుంటూ వస్తోన్న తరుణంలో బీఎస్ఎన్ఎల్ తన కొత్త ఆఫర్‌తో ఒక్కసారికి పంజావిసిరింది.

ఈ ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్, రిలయన్స్, జియో వంటి కంపెనీలు ఎటువంటి ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువస్తాయో చూడాలి. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే Triple Ace Rs 333 పేరుతో ఓ ప్లాన్‌ను మార్కెట్లో అందిస్తోంది. ఈ ప్లాన్ క్రింద 90 రోజుల పాటు రోజుకు 3జీబి 3జీ డేటా అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








