Home
News

మొబైల్‌ యూజర్లకు BSNL వరుస గుడ్‌న్యూస్‌లు.. అందుబాటులోకి 5G సిమ్‌కార్డులు, ఫ్యాన్సీ నంబర్‌లు..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన 4G, 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. తాజాగా ఈ సంస్థ BSNL 5G సిమ్‌ కార్డులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ 5G సిమ్‌ కార్డులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాలు సహా ఇతర అధికారిక రిటైల్‌ దుకాణాల నుంచి ఈ సిమ్‌ కార్డులను కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నం చేస్తోంది. అయితే టాటా సంస్థ భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 4G నుంచి 5G సేవలకు సులభంగా అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు అవకాశం ఉంది.

BSNL Offers 5G Sim Cards and fancy numbers available for users news

ఈ ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే వినియోగదారులు ఆయా సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం BSNL జారీ చేస్తున్న 5G సిమ్‌ కార్డులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సిమ్‌ కార్డులపై 5G సింబల్‌ జాతీయ పతాకంలోని మూడు రంగుల్లో ఉంది. రెగ్యూలర్‌ సైజ్‌తోపాటు మైక్రో, నానో సైజుల్లో ఈ సిమ్‌ కార్డులున్నాయి.

అయితే 5G సిమ్‌ కార్డులపై BSNL ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కొత్త సిమ్‌ కార్డులు తీసుకుంటున్న మరియు పోర్టింగ్‌ ద్వారా BSNL నెట్‌వర్క్‌ను ఎంచుకున్న వారికి ఈ తరహా సిమ్‌ కార్డులను జారీ చేస్తోంది. BSNL ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 30 రోజుల్లో 2 లక్షలకు పైగా కొత్త సిమ్‌ కార్డులు యాక్టివేట్‌ అయినట్లు వెల్లడించించింది.

ఆగస్టు 2 న ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టెస్టింగ్‌లో ఉన్న BSNL 5G నెట్‌వర్క్‌ను పరీక్షించారు. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్ (C-Dot) కార్యాలయం నుంచి BSNL 5G ద్వారా వీడియో కాల్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి X ద్వారా షేర్‌ చేశారు.

ప్రస్తుతం అనేక మంది BSNL నెట్‌వర్క్‌కు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు టెలికాం సంస్థలు గత నెలలో భారీగా రీఛార్జ్‌ ధరలను పెంచడంతో.. తక్కువ ధరల్లో సేవలు అందిస్తున్న BSNL వైపు అనేక మంది చూస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు నచ్చిన మొబైల్ నంబర్‌లకు ఎంచుకొనేందుకు అవకాశం కల్పించింది.

* గూగుల్‌ లేదా ఇతర సెర్చ్‌ ఇంజిన్‌లలో BSNL Choose Your Mobile Number అని టైప్‌ చేయాలి.
* అనంతరం BSNL CYMN అనే లింక్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్‌ చేయాలి.
* తర్వాత జోన్‌ల వారీగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

* అనంతరం కనిపించిన పేజీలో అనేక ఆప్షన్‌లు ఉంటాయి. అందులో మీకు నచ్చిన నంబర్‌ను వెతికేందుకు search with series, Start Number, End Number, Sum of Numbers వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ ట్యాబ్‌ పక్కనే ఫ్యాన్సీ నంబర్‌ల కోసం మరో ఆప్షన్‌ ఉంటుంది.

ఈ ఆప్షన్‌ల ద్వారా మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకొని రిజర్వ్ నంబర్‌ పైన క్లిక్‌ చేయాలి. అనంతరం మీ ప్రస్తుత మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి. మరియు వచ్చిన OTP ను ఆ వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయాలి. చివరగా ఆ వివరాలతో సమీపంలోని BSNL కార్యాలయానికి వెళ్లి గుర్తింపు కార్డులు సమర్పించి సిమ్‌ కార్డును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Offers 5G Sim Cards and fancy numbers available for users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X