BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.300 ధరలో అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, 65 రోజుల వ్యాలిడిటీ..!
భారత్ టెలికాం రంగంలో అత్యధిక శాతం యూజర్లతో జియో తొలి స్థానంలో ఉంది. అనంతరం ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. చిట్ట చివరన ప్రభుత్వ రంగ సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఉన్నాయి. అన్ని సంస్థలు వారి యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. యూజర్ల కాలింగ్, SMS, డేటా, ఓటీటీ ప్రయోజనాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.
అయితే BSNL మాత్రం అన్ని టెలికాం సంస్థల కంటే తక్కువ ధరలో వినూత్నమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు బీఎస్‌ఎన్‌ఎల్ లో మాత్రమే ఉంటాయి. గత జులైలో ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను ఒక్కసారిగా పెంచాయి.

త్వరలో పూర్తి స్థాయి 4G నెట్‌వర్క్ : దీంతో ఆయా యూజర్లు చాలా వరకు BSNL కు పోర్టింగ్ అయ్యారు. దీంతో సంస్థ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో యూజర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు ఈనెల, వచ్చే నెల నాటికి దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఇందు కోసం దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అత్యధిక శాతం టవర్ల ఇన్‌స్టాలేషన్ తోపాటు యాక్టివ్‌లోకి తీసుకొచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 4G నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చిన వెంటనే 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనున్నారు.
ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ : ప్రస్తుతం BSNL ఓ ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఈ తరహా రీఛార్జ్ ప్లాన్ ఇతర టెలికాం నెట్‌వర్క్‌లు విడుదల చేయలేదు. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్, SMS, డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. రెండు నెలల కంటే ఎక్కువ వ్యాలిడిటీ అందిస్తోంది.
BSNL రూ.319 రీఛార్జ్ ప్లాన్ (BSNL Rs319 Recharge Plan) ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను మాత్రమే అందిస్తోంది. ఈ SMS ల వినియోగంలో రోజువారీ ఎటువంటి పరిమితి లేదు. దీంతోపాటు డేటా పరంగా మొత్తం వ్యాలిడిటీతో 10GB డేటాను అందిస్తోంది.
65 రోజుల రీఛార్జ్ ప్లాన్ : ఈ డేటాను రోజువారీ పరిమితి లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 40kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 65 రోజులుగా ఉంది. ఇతర టెలికాం సంస్థలు ఈ తరహా వ్యాలిడిటీతో ఎటువంటి రీఛార్జ్ ప్లాన్‌లను అందించడం లేదు.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.485 రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL Rs485 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 2GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 80 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 160GB డేటాను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








