Home
News

BSNL రూ.197 రీఛార్జ్‌ ప్లాన్‌తో 70 రోజుల వ్యాలిడిటీ.. కాలింగ్‌, డేటా ప్రయోజనాల పూర్తి వివరాలు..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) కు ఇటీవల భారీగా ఆధరణ పెరిగింది. గత నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా భారీగా రీఛార్జ్‌ ధరలను పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్టింగ్‌ అవుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కూడా తక్కువ ధరలో మెరుగైన సర్వీసులను అందిస్తోంది. దీంతోపాటు త్వరలో 4G సర్వీసులను ప్రారంభించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేస్తోంది.

BSNL రూ.197 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా ఏకంగా 70 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ముఖ్యంగా సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ రీఛార్జ్‌ ప్లాన్ ఉపయోగపడుతుంది. వ్యాలిడిటీతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటా, SMS ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్‌ ద్వారా పొందవచ్చు. పూర్తి వివరాలు.

BSNL RS 197 Recharge Plan offers 70 days of validity

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 70 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు ఈ ప్లాన్‌లో భాగంగా మొదటి 15 రోజులపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు తొలి 15 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా SMS ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఎక్కువ రోజులపాటు సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు అవకాశం ఉంది.

ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో BSNL 4G సర్వీసులను ప్రారంభించనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా ఇప్పటికే వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2024 అక్టోబర్‌ చివరి నాటికి 80,000 టవర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2025 మార్చి నాటికి మిగిలిన 21,000 టవర్ల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు.

ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో BSNL 4G సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ నాటికి మరిన్ని ప్రాంతాల్లో 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకురానుందని తెలిపింది. గ్రామాల్లోనూ 4G సర్వీసులు అందించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సెప్టెంబర్‌ నెల చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 4G ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుత BSNL వినియోగదారులు 4G సిమ్‌ కార్డులకు అప్‌గ్రేడ్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది. అనేక ప్రాంతాల్లో 4G సిమ్‌ కార్డులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే 5G సిమ్‌ కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ 5G సిమ్‌ కార్డులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL offers 70 days validity with RS 197 prepaid recharge Plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X