Home
News

BSNL అందిస్తున్న ఉత్తమ డేటా STVs & WFH వోచర్ల పూర్తి వివరాలు...

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు అనేక రకాల డేటా స్పెషల్ టారిఫ్ వోచర్లు (STV) ను అందిస్తుంది. ఈ టెలికాం ఆపరేటర్ అందించే ఉత్తమ డేటా STVలు వినియోగదారులకు ఎటువంటి వేగ పరిమితులు లేకుండా అపరిమిత డేటాను అందించడం మరొక గొప్ప విషయం. ప్రస్తుత సమయంలో ఇతర టెలికాం ఆపరేటర్లు ఎవరూ కూడా ఇటువంటి డేటా ఆఫర్లను తమ వినియోగదారులకు అనిందించడం లేదు. బిఎస్‌ఎన్‌ఎల్ అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) డేటా ఎస్‌టివిలు మరియు BSNL యొక్క ఉత్తమ డేటా STV ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL STV_97 ప్లాన్ ప్రయోజనాలు

BSNL STV_97 ప్లాన్ ప్రయోజనాలు

BSNL సంస్థ రూ.97 ధర వద్ద అందిస్తున్న STV_97 డేటా ప్లాన్ 18 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ వోచర్ వినియోగదారులకు రోజుకు 250 నిమిషాల అపరిమిత కాలింగ్‌ ప్రయోజనంతో పాటుగా 2GB రోజువారీ డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా లోక్‌ధమ్ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తుంది. రోజువారీ డేటాను వినియోగించిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbps కి పడిపోతుంది.

 

BSNL Data_WFH_151 ప్లాన్ ప్రయోజనాలు

BSNL Data_WFH_151 ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా_WFH_151 డేటా ప్లాన్ వినియోగదారులకు పేరుకు తగ్గట్టుగా రూ.151 ధర వద్ద లభిస్తుంది. ఈ వోచర్ వినియోగదారులకు మొత్తంగా 40GB డేటాను హై-స్పీడ్ తో 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా జింగ్ యొక్క సబ్స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందిస్తుంది.

BSNL DataSTV_198 ప్లాన్ ప్రయోజనాలు

BSNL DataSTV_198 ప్లాన్ ప్రయోజనాలు

BSNL DataSTV_198 ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందినచడంతో పాటుగా రింగ్ టోన్‌ యొక్క ప్రయోజనాన్ని ఉచితంగా కూడా అందిస్తుంది. ఈ వోచర్ 54 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. యూజర్స్ రోజువారీ డేటాను వినియోగించిన తరువాత డేటా వేగం 40 Kbps కి పడిపోతుంది.

BSNL Data_WFH_251 వోచర్ ప్రయోజనాలు

BSNL Data_WFH_251 వోచర్ ప్రయోజనాలు

BSNL Data_WFH_251 వోచర్ ప్లాన్ అధికంగా డేటాను వినియోగించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వోచర్‌తో వినియోగదారులు జింగ్ యొక్క ఉచిత సభ్యత్వంతో పాటు 70GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

BSNL STV_998 వోచర్ ప్రయోజనాలు

BSNL STV_998 వోచర్ ప్రయోజనాలు

BSNL టెల్కో అందిస్తున్న రెండవ అత్యంత ఖరీదైన వోచర్ ఇది. ఈ వోచర్ 300 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా 2 నెలల పాటు ఉచిత రింగ్ టోన్‌ ప్రయోజనం మరియు లోక్‌ధమ్ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తుంది. కానీ లోక్‌ధం కంటెంట్‌ యొక్క ప్రయోజనం మొదటి 240 రోజుల వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Offers Best Data STVs and Work From Home Plans: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X