BSNL మొబైల్ కాల్స్‌ను ల్యాండ్ లైన్‌లో రిసీవ్ చేసుకోవచ్చు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 'ఫ్రీ టు హోమ్' పేరుతో సరికొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసులో భాగంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్‌లు తమ మొబైల్‌కు వచ్చే కాల్స్‌ను ఏ విధమైన అదనపు ఛార్జీలు లేకుండా తమ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ కల్పించే కాల్ డైవర్టింగ్ సదుపాయం ద్వారా మొబైల్ కాల్స్‌ను ల్యాండ్‌లైన్‌కు మళ్లించుకునే వీలు ఉంటుంది.

ఆల్వేస్ డైవర్ట్, కాల్ డైవర్షన్ వెన్ బిజీ, కాల్ డైవర్షన్ ఇన్‌కేస్ ఆఫ్ హ్యాండ్‌సెట్ ఈజ్ టర్నడ్ ఆఫ్, డైవర్ట్ వెన్ ఫోన్ ఇన్ నో కవరేజ్ ఏరియా, కాల్ డైవర్షన్ వెన్ ఫోన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ వంటి మల్టీపుల్ కాల్ ఫార్వార్డింగ్ ఆప్షన్‌లను ఈ ఫీచర్ కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న మొబైల్ యూజర్లు ఈ సర్వీసును యాక్సిస్ చేసుకోవచ్చు.
Read More : మార్కెట్లో సేల్ అవుతోన్న 20 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ
బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 14 టెలికామ్ సర్కిళ్లలో 4జీ సేవలను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ 20 మెగాహెర్ట్జ్ బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. ఇప్పటికే చండీగఢ్‌లో బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను లాంచ్ చేసింది...

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ
ఎంపిక చేసిన 14 సర్కిళ్లలో తాము 2500 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో 20 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉన్నామని, దీనివల్ల ఎటువంటి లైసెన్స్ ఇబ్బందులు లేకుండా 4జీ సర్వీసులను ఈ సర్కిళ్లలో ప్రారంభించగలమని బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ
ప్రస్తుతం ఉన్న జీఎస్ఎమ్ సైట్లలోనే 4జీ బేస్ టవర్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తామని, దీంతో టవర్ల నిర్మాణానికి అదనపు ఖర్చు ఉండదని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ
2500 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా యాపిల్, మోటరోలా, లెనోవో, గూగుల్ వంటి కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ
వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2500మెగాహెడ్జ్ బ్యాండ్‌తో 4జీ సేవలను కమర్షీయల్‌గా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బీఎస్ఎల్ సిద్ధమవుతోంది.

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ
ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా పోటీ సంస్థలు ఇప్పటికే 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కూడా మరిన్ని సర్కిళ్లలో దీన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది.


Click it and Unblock the Notifications








