TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఈ సారి BSNL వంతు,అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఏడాది పాటు ఫ్రీ
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలకు ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ టెలికాం దిగ్గజం ఏడాది పాటు వీడియో లైమ్ స్ట్రీమింగ్ సర్వీసును ఉచితంగా అందించేందుకు రెడీ అయింది. ఈ కంపెనీ రీ ఛార్జ్ ప్లాన్ల ద్వారా యూజర్లు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్ సర్వీసులకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. మరి ఈ ఆఫర్ ను పొందాలంటే ఏం చేయాలో ఓ స్మార్ట్ లుక్కేయండి.
ఆ డోర్ బెల్‌ను మోగించింది దెయ్యమేనా? (వైరల్ వీడియో)
రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్,రూ. 745 ల్యాండ్ లైన్ ప్లాన్ ద్వారా
యూజర్లు రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా కాని లేదా రూ. 745 ల్యాండ్ లైన్ ప్లాన్ ద్వారా కాని అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లను యూజర్లు రీఛార్జ్ చేసుకుంటే అమెజాన్ సర్వీసులను ఏడాదిపాటు ఉచితంగా పొందే అవకాశం ఉంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్...
కాగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఇండియా ధర నెలకి రూ.129గానూ అలాగే ఏడాదికి రూ.999 గానూ ఉంది. ఈ ప్లాన్ల ద్వారా అమెజాన్ యూజర్లకు కొనుగోలు సమయంలో అనేక రకాల బెనిఫిట్లను కంపెనీ అందిస్తోంది.
ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న యూజర్లకు...
ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న యూజర్లకు product on sale, schedule delivery, fast shipping, Prime Music and Prime Video లాంటి వాటిల్లో భారీగా ప్రయోజనాలు అందుతాయి. లైవ్ స్ట్రీమింగ్ సర్వీసులు కూడా ఉచితంగా అందుతాయి.
బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ఆఫర్లను పొందాలంటే....
బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ఆఫర్లను పొందాలంటే ముందుగా BSNL websiteలో కెళ్లి Amazon Prime offer banner మీద క్లిక్ చేయాలి. అక్కడ మీ మొబైల్ నంబర్ కాని అలాగే ల్యాండ్ లైన్ నంబర్ కాని ఎంటర్ చేయాలి. అలాగే మీ ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిన తరువాత మీకు ఓటిపి వస్తుంది.
ఒటిపి ఎంటర్ చేసిన తరువాత...
ఈ ఒటిపి ఎంటర్ చేసిన తరువాత మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లాగిన్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీకు అకౌంట్ లేకుంటే ఒకటి క్రియేట్ చేసకోవాలి. అయితే ఈ ఆఫర్ కొత్త ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాత యూజర్లు తమ ప్రైమ్ మెంబర్ షిప్ వ్యాలిడిటీ అయిపోయిన తరువాత మాత్రమే ఈ ప్లాన్ లోకి మారాల్సి ఉంటుంది.