BSNL నుంచి దిమ్మతిరిగే ఆఫర్, రోజుకు 5జిబి డేటా ఉచితం
దేశీయ టెలికాం మార్కెట్లో రోజు రోజుకు వార్ వేడెక్కుతున్న నేపథ్యంలో టెల్కోలు యూజర్లను ఆకట్టుకునేందుకునే అట్రాక్టివ్ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ముఖ్యంగా బ్రాడ్ బ్యాండ్ రంగంలో ఇప్పుడు వార్ నువ్వా నేనా
దేశీయ టెలికాం మార్కెట్లో రోజు రోజుకు వార్ వేడెక్కుతున్న నేపథ్యంలో టెల్కోలు యూజర్లను ఆకట్టుకునేందుకునే అట్రాక్టివ్ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ముఖ్యంగా బ్రాడ్ బ్యాండ్ రంగంలో ఇప్పుడు వార్ నువ్వా నేనా అన్నట్లుగా తయారైంది. జియో గిగాఫైబర్ త్వరలో రానుందనే వార్తలు వస్తుండటంతో బ్రాడ్ బ్యాండ్ దిగ్గజాలు యూజర్లు చేజారిపోకుండా సరికొత్త ఎత్తుగడను వేస్తున్నాయి.

ప్రభుత్వ రంగం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఈ విషయంలో ఇంకాస్త ముందుకెళ్లి యూజర్లకు ఉచితంగా 5జిబి డేటాను అందించే పనికి శ్రీకారం చుట్టింది. దాని వివరాలు ఓ సారి చూద్దాం.

ఫ్రీ బ్రాడ్‌బాండ్
బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్ వినియోగదారులకు కంపెనీ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. అదే ఫ్రీ బ్రాడ్‌బాండ్ ఆఫర్. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ స్కీమ్‌ను పొందాలంటే బీఎస్‌ఎన్‌ఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 18003451504 నెంబర్‌కు తమ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.

కనెక్షన్ కోసం కస్టమర్లు
బ్రాడ్‌బాండ్ కనెక్షన్ కోసం కస్టమర్లు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొన్నది. ఈ ఆఫర్ కింద.. రోజుకు 5జీబీ డేటా(10ఎంబీపీఎస్ స్పీడ్ వరకు) ఉపయోగించుకోవచ్చు.

25 శాతం క్యాష్‌బాక్
ఇక ఇదివరకే బ్రాడ్‌బాండ్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు 25 శాతం క్యాష్‌బాక్, ఒక సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్సన్ అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.

ఫ్రీ వాయిస్ కాలింగ్
ఫ్రీ బ్రాడ్‌బాండ్‌తో పాటు ఫ్రీ వాయిస్ కాలింగ్ అనే ఆఫర్‌ను తన లాండ్‌లైన్, లాండ్‌లైన్ బ్రాడ్‌బాండ్, మొబైల్ కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. ఈ సర్వీసును కంపెనీ వింగ్స్ వీవోఐపీ అనే ప్లాట్‌ఫాం ద్వారా పొందొచ్చు.

వింగ్స్ ప్లాట్‌ఫాం
వింగ్స్ ప్లాట్‌ఫాంతో ప్రపంచంలో ఎక్కడైనా ఇన్‌కమింగ్ కాల్స్‌కు రోమింగ్ ఉచితంగా ఉంటుంది. ఔట్‌గోయింగ్ కాల్స్‌కు అయితే.. నిమిషానికి 1.20 రూపాయలను బీఎస్‌ఎన్‌ఎల్ చార్జ్ చేస్తుంది. అది కూడా యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి ఇండియాకు చేసే కాల్స్‌కే రూ.1.20 ను చార్జ్ చేయనుంది.

బీఎస్ఎన్ఎల్‌కు పోటీగా ఐడియా
బీఎస్ఎన్ఎల్‌కు పోటీగా ఐడియా నిర్వాన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్, ఐడియా.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందాలంటే 999 రూపాయలు కట్టాల్సి ఉంది. ఆ డబ్బులను వొడాఫోన్, ఐడియా కంపెనీలు కట్టి.. తమ కస్టమర్లకు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నాయి.

బీఎస్ఎన్ఎల్‌కు పోటీగా ఐడియా
ఐడియా నిర్వాన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రకారం 399 రూపాయలు అంతకంటే ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఉన్నవాళ్లు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు అర్హులు. ఇదిలా ఉంటే వొడాఫోన్ సపరేట్‌గా తన రెడ్ సబ్‌స్ర్కైబర్స్‌కు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








