ఇక తెలుగులోనూ మీ ఈ-మెయిల్ ఐడీ

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు 8 భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన 'DataMail' యాప్ ద్వారా యూజర్లు ఈ సదుపాయాన్ని పొందే వీలుంటుంది.

ఇక తెలుగులోనూ మీ ఈ-మెయిల్ ఐడీ

Read More : 200 సంవత్సరాలు ప్రయత్నించినా తెలుసుకోలేని పాస్‌వర్డ్!

టెల్కోటాక్ తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ యూజర్లు DataMail యాప్‌లోకి వెళ్లి తమ సొంత భాషలో ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు. తెలుగు సహా తమిళం, హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది.

ఇక తెలుగులోనూ మీ ఈ-మెయిల్ ఐడీ

Read More : స్మార్ట్‌ఫోన్ మోజులో పడి మీ కంటి చూపును నిర్లక్ష్యం చేయకండి

ఈ డేటామెయిల్ సర్వీసును ఆండ్రాయిడ్ యూజర్లు గూగల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ సర్వీసులో భాగదంగా DataOne.Bharat అనే డొమైన్ నుంచి మెయిల్ ఐడీని క్రియేట్ చేసకోవల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ పేరు అక్షయ్ అనుకోండి. అక్షయ్@ DataOne.Bharat అని మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ అకౌంట్‌ సెక్యూర్‌గా ఉండాలంటే..?

సమాచారాన్ని షేర్ చేసుకునే క్రమంలో మనలో చాలా మంది ఈ-మెయిల్ అకౌంట్‌లను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు సింపుల్ టిప్స్..

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ అవసరం..

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసి వాటిని తరచూ మారుస్తూ ఉండటం ద్వారా ఈ ఈమెయిల్ అకౌంట్‌లను పూర్తి సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు.

వాటిని ఓపెన్ చేసే ముందు జాగ్రత్త..

మీ మెయిల్ ఐడీని నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే షేర్ చేయండి. ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన అటాచ్‌మెంట్స్, డౌన్‌లోడింగ్ ఫైల్స్‌ను ఓపెన్ చేసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాటి పై ఓ నిర్థారణకు వచ్చాక మాత్రమే ఓపెన్ చేయండి.

స్పామ్ మెయిల్స్‌తో జాగ్రత్త..

స్పామ్ మెయిల్స్‌కు రిప్లై ఇవ్వకండి. వివిధ ఆఫర్లను ఎరవేసే మోసూపూరిత మెయిల్స్‌ను ఏ మాత్రం విశ్వసించకండి. ఈమెయిల్ కంటెంట్ మానిటరింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీకొచ్చే ప్రతి మెయిల్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు. యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ అకౌంట్ కు త భద్రతను మరింతగా పెంచుకోవచ్చు.

అవి తప్పనిసరి..

ఈమెయిల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొగిలగే సామర్థ్యం యాంటీ స్పామ్, యాంటీ వైరస్, కంటెంట్ ఫిల్టరింగ్ వంటి ఫీచర్లకు ఉంది. కాబట్టి మీ డివైస్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Offers Free E-mail Address Service in 8 Indian Languages. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot