తక్కువ ధరలో 300 రోజులకుపైగా వ్యాలిడిటీతో BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి ప్రయోజనాలు..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. జులై తొలి వారంలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా (Vi) మొబైల్ టారిఫ్ ధరలను భారీగా పెంచాయి. దీంతోపాటు అనేక మంది మొబైల్ యూజర్‌లు BSNL కు పోర్టింగ్ కావడం ప్రారంభించారు. గత జులై, ఆగస్టు ట్రాయ్ నివేదికలే ఇందుకు ఉదాహరణ. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్న BSNL.. తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది.
ప్రైవేటు టెలికాం ప్రొవైడర్‌లతో పోలిస్తే BSNL సుమారుగా అన్ని రీఛార్జ్ ప్లాన్‌లను చాలా తక్కువ ధరకు అందిస్తోంది. ఫలితంగా ఎక్కువ మంది యూజర్‌లను ఆకట్టుకుంటోంది. దీంతోపాటు త్వరలో 4G, 5G సేవలు ప్రారంభం కానున్నాయనే ప్రకటనలతో ప్రభుత్వరంగ టెలికాం నెట్‌వర్క్ వైపు యూజర్‌లు మొగ్గు చూపుతున్నారు.

ఇటీవలే BSNL కొత్త లోగో తోపాటు 7 రకాల సేవలపై కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా BSNL CMD కీలక ప్రకటన చేశారు. సమీప భవిష్యత్‌లో BSNL రీఛార్జ్ ప్లాన్లను పెంచే ఆలోచన లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జీల పెంచాల్సిన అవసరం లేదన్నారు. తమ లక్ష్యమంతా వినియోగదారుల విశ్వాసాన్ని పొందడం మాత్రమేనని చెప్పారు.
BSNL ప్రస్తుతం 300 రోజులకు పైగా వ్యాలిడిటిని అందించే అనేక ప్లాన్‌లను కలిగి ఉంది. రూ.1,198, రూ.1,499, రూ.1,999, రూ.2,399 ఈ రీఛార్జ్ ప్లాన్లు కనిష్టంగా 336 రోజుల వ్యాలిడిటీ నుంచి 395 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. ఈ ప్లాన్‌ల ప్రయోజనాల పూర్తి వివరాలు.

BSNL రూ.1198 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (BSNL RS1198 Recharge Plan) ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెల 300 నిమిషాల కాలింగ్ సమయంతోపాటు 3GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 30 SMS వరకు ప్రతినెల వినియోగించుకోవచ్చు.
రూ.1499 రీఛార్జ్ ప్లాన్ : BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (BSNL RS1499 Recharge Plan) ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు 24GB డేటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.
రూ.1999 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా (BSNL RS1999 Recharge Plan) అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా 600GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీంతోపాటు BSNL ట్యూన్స్, హార్డీ గేమ్స్ సహా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.2399 రీఛార్జ్ ప్లాన్ : ఈ BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో (BSNL RS2399 Recharge Plan) 395 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాతోపాటు 100 SMS లను వినియోగించుకోవచ్చు. వీటితోపాటు BSNL ట్యూన్స్, జింగ్ మ్యూజిక్, హార్డీ గేమ్స్ సహా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








