Home
News

BSNL అందించే ఉత్తమ డేటా ప్యాక్‌ల మీద ఓ లుక్ వేయండి...

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెల్కో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ సంస్థ ఇప్పుడు తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి అపరిమిత కాంబో ప్లాన్స్, వాయిస్-ఓన్లీ ప్లాన్స్, SMS ప్యాక్ మరియు డేటా-ఓన్లీ ప్యాక్ వంటి వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. టెలికాం పోటీ పరిశ్రమలో బిఎస్ఎన్ఎల్ కొన్ని ఉత్తమమైన అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

బిఎస్‌ఎన్‌ఎల్ డేటా ప్యాక్

ప్రస్తుతం వినియోగదారులు రోజువారీ డేటా ప్రయోజనాన్ని అధికంగా కలిగి ఉన్న ప్లాన్లను ఇష్టపడుతున్నారు. మరింత ఎక్కువ డేటా అవసరం అయిన వారు డేటా ప్యాక్ లతో రీఛార్జ్ చేస్తూ ఉంటారు. బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు డేటా ప్లాన్‌లను కేవలం రూ.16 నుంచి అందిస్తున్నది. బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో STV16, STV 57, STV 98, STV 151, STV 198, STV 251 మరియు STV 998 ధరల వద్ద డేటా ప్యాక్‌లను అందిస్తున్నది. టెల్కో యొక్క STV 998 ప్యాక్ అనేది పరిశ్రమలో లభించే ఉత్తమ డేటా ప్లాన్. ఎందుకంటే ఇది 240 రోజుల చెల్లుబాటుతో రోజుకు 3GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రారంభ STV డేటా ప్యాక్లు

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రారంభ STV డేటా ప్యాక్లు

బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో తన యొక్క వినియోగదారులకు STV 16 ప్రారంభ ధర వద్ద డేటా ప్లాన్ లను అందిస్తుంది. ఈ ప్లాన్ 2GB డేటాను ఒక రోజు వాలిడిటీతో అందిస్తుంది. డేటా ప్రయోజనం 24 గంటల తర్వాత ముగుస్తుంది కాబట్టి ఇది ఏ ప్రీపెయిడ్ ప్లాన్ పైన అయినా రీఛార్జ్ చేయవచ్చు.కొంచెం ఎక్కువ డేటాను కోరుకునేవారు STV 57 ని ఎంచుకోవచ్చు. ఇది 10 రోజుల వాలిడితో 10GB డేటాతో పాటు జింగ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది. అలాగే STV 98 డేటా ప్యాక్ రోజుకు 2GB డేటాను 22 రోజులు చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. సాధారణ డేటా ప్రయోజనంతో పాటు వినియోగదారులు ఈరోస్ నౌకి ఉచిత యాక్సిస్ ను పొందుతారు.

రూ.100 పైన లభించే బిఎస్‌ఎన్‌ఎల్ STV డేటా ప్యాక్లు

రూ.100 పైన లభించే బిఎస్‌ఎన్‌ఎల్ STV డేటా ప్యాక్లు

బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో రూ.151 ధర వద్ద అందించే డేటా ప్యాక్ రోజు వారి డేటా కాకుండా ఇది నిర్ణీత మొత్తంలో డేటాను అందిస్తుంది. అంటే 28 రోజుల వ్యవధిలో 40GB డేటాను అందిస్తుంది. కస్టమర్లు జింగ్ సబ్స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా పొందుతారు. అలాగే STV 198 డేటా ప్యాక్ 54 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటాతో లభిస్తుంది. దీని తరువాత 40 Kbps తగ్గించబడి అపరిమిత డేటాను అందిస్తుంది. ఇది వాట్సాప్ చిత్రాలను పంపడానికి మరియు స్వీకరించడానికి సరిపోతుంది. కొన్ని సర్కిల్‌లలో బిఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో జింగ్ సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.

బిఎస్‌ఎన్‌ఎల్ STV 998 డేటా ప్యాక్

బిఎస్‌ఎన్‌ఎల్ STV 998 డేటా ప్యాక్

బిఎస్‌ఎన్‌ఎల్ STV డేటా ప్యాక్ జాబితాలో చివరిది STV 998 ప్లాన్. ఇది BSNL యొక్క నెట్‌వర్క్‌లో లభించే ఉత్తమ డేటా ప్యాక్. ఇది రోజుకు 3GB డేటాను 240 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ 2021 మార్చి 23 వరకు మాత్రమే చెల్లుతుందని బిఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. టెల్కో ఈ ప్రణాళిక లభ్యతను మరో 90 రోజులు పొడిగిస్తుందని మేము ఆశిస్తున్నాము.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Offers Prepaid Data Recharge Packs: Validity and Prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X