రూ. 75 చెల్లించండి, 10జిబి డేటా,అన్‌లిమిటెడ్ కాల్స్ పొందండి
మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ , వొడాఫోన్ ఆఫర్లకు అనుగుణంగా మరో ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూపోతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు అయితే పోటీపడీ మరీ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలకు పోటీగా ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL సరికొత్త ఆఫర్‌ని తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ.75 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 10జీబీ(2జీ/3జీ) డేటా, 500 ఎస్సెమ్మెస్‌లను మొబైల్ వినియోగదారులు వినియోగించుకోవచ్చు.

15 రోజులు పాటు..
రూ.75 రీఛార్జ్‌తో 15 రోజులు పాటు అపరిమిత కాల్స్ అలాగే 10 జిబి డేటాను ఉపయోగించుకోవచ్చు. యూజర్లు ఈ ఆఫర్‌ను 180 రోజుల వరకు పొడిగించుకునే వీలుందని సంస్థ తెలిపింది.

తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో..
బీఎస్‌ఎన్‌ఎల్ జీవిత ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా రూ.75 రీఛార్జ్ ఆఫర్ తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో ప్రస్తుతం అందుబాటులో ఉండనుంది.

రీఛార్జ్
కస్టమర్లు రూ.98, రూ99, రూ.118, రూ.139, రూ.187, రూ.198, రూ.319, రూ.333, రూ.349, రూ.395, రూ.444, రూ.447, రూ.551లతో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు ఆ ఆఫర్లను ఉపయోగించుకునే వీలుంది.

రూ.98, రూ.199తో
రూ.98, రూ.199తో ప్రత్యేక రీఛార్జ్ చేసుకుంటే రూ.75 ప్లాన్‌తో లభించే అన్ని ఆఫర్లను మరో 90రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు.

ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకుంటే..
ఈ రెండు రీఛార్జ్‌ల కన్నా ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల వరకు ఈ ఆఫర్ వర్తించనుంది.

పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే..
కొత్త ప్లాన్‌పై పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే కస్టమర్లు రీఛార్జ్ చేసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ సూచించింది.

రూ.171 రీఛార్జ్‌తో ..
వారం క్రితం బీఎస్‌ఎన్‌ఎల్ ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.171 రీఛార్జ్‌తో ప్రతిరోజు 2జీబీ(2జీ/3జీ) డేటాతో పాటు అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ఆఫర్ కాలపరిమితి 30 రోజులు మాత్రమే.


Click it and Unblock the Notifications








