Home
News

తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలతో రెండు BSNL ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే మెరుగైన ప్రయోజనాలను అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4G సర్వీసులు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పంజాబ్‌లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు ప్రీపెయిడ్ ప్లా్న్‌ లు (BSNL Recharge Plans) తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్‌ల ప్రయోజనాలు, వ్యాలిడిటీ సహా ఇతర పూర్తి వివరాలు మీకోసం.

BSNL రూ.108 ప్లాన్‌ వివరాలు : తక్కువ ధరకే మెరుగైన ప్రయోజనాలు అందిస్తున్న ప్లాన్‌లలో ఇది కూడా ఒకటిగా ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు రూ.108 తో రీఛార్జీ చేయించుకుంటే.. రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది.

BSNL RS107 and RS108 prepaid recharge plans

ఈ ప్లాన్‌లో ఉచిత SMS సదుపాయం లేదు. లోకల్‌ SMS లకు 80 పైసలు, నేషనల్ SMS కు రూ.1.20 వసూలు చేస్తారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. తక్కువ ధరలో ఈ ప్లా్న్‌ వినియోగపడుతుంది. దీంతోపాటు రూ.107 తో మరో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కూడా ఉంది.

BSNL రూ.107 ప్లాన్‌ : ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తం 3GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 200 నిమిషాల పాటు కాలింగ్ సమయాన్ని వినియోగించుకోవచ్చు. అయితే BSNL ట్యూన్స్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి ఉచిత SMS ప్రయోజనాలు అందుబాటులో లేవు.

ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.58 మరియు రూ.59 ధరలతో రెండు ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌లలో ఒకటి డేటా వోచర్‌, మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్‌గా ఉంది. ఈ రెండు ప్లాన్‌లలోనూ డేటా సదుపాయం ఉంటుంది.

BSNL రూ.59 ప్లాన్‌ : ఇది వ్యాలిడిటీ ప్లాన్‌గా ఉంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయంతోపాటు 1GB రోజువారీ డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఎటువంటి SMS లు లభించవు. దీంతోపాటు రూ.58తో మరో ప్లాన్‌ను అందుబాటులో ఉంది.

BSNL రూ.58 ప్లాన్‌ : ఇది డేటా వోచర్‌ ప్లాన్‌. దీని వ్యాలిడిటీ 7 రోజులపాటు ఉంటుంది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకొనేందుకు యూజర్‌ యాక్టివ్‌ బేసిక్‌ ప్లాన్‌ను కలిగి ఉండాలి. ఈ ప్లాన్‌ ద్వారా ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. అనంతరం 40kbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Offers RS107 and RS108 prepaid recharge plans with best benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X