Just In
- 9 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 14 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 16 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
BSNL STV399 ఆఫర్, కేవలం 100 రూపాయలకేనా...!
వినియోగదారులను పెంచుకునే క్రమంలో జియో నుండి వచ్చే గట్టి పోటీని తట్టుకోడానికి, మిగిలిన అన్ని నెట్వర్క్ల మాదిరిగానే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఈ STV 399 రూపాయల ఆఫర్ను, కేవలం రూ. 100 కే లభించేలా, మెగా ఆఫర్ ప్రవేశపెట్టింది. జియో తన సరికొత్త ఆఫర్స్ మరియు కూపన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ, ఇతర నెట్వర్కుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో BSNL ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్ ఎంతమేర వినియోగదారులను ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ ఆఫర్ విజయవంతం అయితే, ప్రవేశపెట్టబడిన 7 రాష్ట్రాలలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇటువంటి పోలికలతో కూడిన పథకాలు, అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఆఫర్ కేవలం IOCL మరియు HPCL LPG వినియోగదారులకు మాత్రమే లభిస్తుంది...
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL), మరియు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థల కస్టమర్లకు, అది కూడా BSNL సిం కార్డు లేని వారి కోసం మాత్రమే ఈ కూపన్లను అందివ్వబడ్డాయి. ఈ కొత్త ఆఫర్ ఈ ఎల్పిజి సంస్థల వినియోగదారులకు కూపన్ రూపంలో, బిల్లు ద్వారా అందివ్వబడుతుంది. వారు కొత్త ఉచిత బిఎస్ఎన్ఎల్ సిమ్ కోసం ఈ కూపన్ రీడీమ్ చేసి, STV రూ. 399 ప్లాన్ ఆఫర్ను కేవలం 100 రూపాయలకే పొందవచ్చు.

BSNL నెట్వర్క్లోకి విచ్చేసిన నూతన వినియోగదారులు....
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ద్వారా ఇతర నెట్వర్కుల నుండి, BSNL నెట్వర్క్లోకి విచ్చేసిన నూతన వినియోగదారులు, మరియు నేరుగా BSNL సిం కార్డ్ తీసుకుంటున్న వినియోగదారుల కోసం మెగా ఆఫర్ ప్రారంభించబడింది. అనగా పాత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు. మరియు ఈ ఆఫర్ కేవలం IOCL మరియు HPCL వినియోగదారులకు మాత్రమే. ఈ వినియోగదారులు వారి LPG బిల్లులలో ముద్రించిన కూపన్ ద్వారా, STV 399 ప్లాన్ ఆఫర్ను, 100 రూపాయలకే పొందగలరు. కానీ, ఈ కూపన్ ప్రస్తుతం కేవలం ఏడు రాష్ట్రాలలో మాత్రమే లభిస్తుంది - అవి వరుసగా, ఉత్తరప్రదేశ్ (ఈస్ట్ & వెస్ట్), ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ మరియు జమ్ము & కాశ్మీర్. విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఆఫర్ అందించే అవకాశాలు లేకపోలేదు.

BSNL ఆఫీసుల్లో ఉచిత బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు....
అర్హులైన వినియోగదారులందరూ భాగస్వామ్య దుకాణాల్లో, మరియు BSNL ఆఫీసుల్లో ఉచిత బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు. మరియు కేవలం 100 రూపాయలు చెల్లించి, 399 రూపాయల ప్లాన్ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఈ బిఎస్ఎన్ఎల్ STV 399 రూపాయల ప్లాన్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించబడింది. దీని ప్రయోజనాలను గమనిస్తే, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS మెసేజులు, రోజుకు 1 జిబి ఇంటర్నెట్ డేటా చొప్పున 74 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంతేకాకుండా, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (PRBT) ఫీచర్ కలిగి, ఏ పాటనైనా 74 రోజులలో ఎప్పుడైనా మార్చుకోగలిగేలా ఆఫర్ ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ రోమింగ్లో ఢిల్లీ మరియు ముంబై పరిధులలో కూడా ఈ కొత్త ఆఫర్ వర్తించబడుతుంది.

ఈ మెగా ఆఫర్ 'అన్లిమిటెడ్ వెల్కం గిఫ్ట్' వలె ఉంటుంది....
కొత్త మరియు MNP ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ మెగా ఆఫర్ 'అన్లిమిటెడ్ వెల్కం గిఫ్ట్' వలె ఉంటుందని అనుపమ్ శ్రీవాస్తవ, CMD, BSNL అన్నారు. అనగా రోజుకు 1.35 రూపాయలకే 74 రోజుల పాటు, ఈ ఆఫర్ ప్రయోజనాలను పొందవచ్చునని అర్ధం.

ఎంపిక చేయబడిన ఏడు రాష్ట్రాలలో మాత్రమే.....
ఆఫర్ చాలా బాగుంది కదూ. ఈ ఆఫర్ కేవలం కొన్ని రాష్ట్రాలలోనే కాకుండా, అన్ని రాష్ట్రాలలో అందుబాటులోకి వస్తే బాగుంటుంది అని వినియోగదారుల అభిప్రాయం. అంతేకాకుండా, పాత కస్టమర్లను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఆఫర్స్, 4జి, వంటి అంశాలలో ఇతర నెట్వర్కులతో పోల్చినప్పుడు BSNL కొంతమేర వెనుకనే ఉందని చెప్పవచ్చు. 90 శాతం నెట్వర్క్స్ 4జి లోకి అడుగుపెట్టినా కూడా, ఇంకా BSNL 3జి పరిధిలోనే ఆఫర్లను ప్రవేశపెడుతూ ఉంది. క్రమంగా వారి ఆలోచనలకు దగ్గరగా ఉన్న నెట్వర్క్స్ పరిధిలోనికి వినియోగదారులు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున, కొత్త కస్టమర్లను ఆహ్వానించడంలోనే కాకుండా, ఉన్న వారిని నిలబెట్టుకునేలా ప్రణాళికలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా, ఈ 7 రాష్ట్రాలలో BSNL సిం తీసుకునేవారికి, అదృష్టమనే చెప్పాలి. రోజుకి 1.35 రూపాయలతోనే 74 రోజుల పాటు, అన్నిరకాల ప్రయోజనాలను పొందడం తేలికైన విషయం కాదు, ఈ ఆఫర్తో వినియోగదారులను ఆకర్షించగలుగుతుందని టెక్ విశ్లేషకుల అభిప్రాయం కూడా.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470