అపరిమిత డేటా ప్రయోజనంతో తక్కువ ధరలోనే BSNL ప్రీపెయిడ్ ప్లాన్!! పూర్తి వివరాలు ఇవిగో

|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెలికాం సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం పరిమిత డేటా ప్లాన్‌ను అందిస్తూ అందరిని తన వైపుకు ఆకట్టుకుంటున్నది. భారతదేశంలోని టెలికాం కస్టమర్లకు తక్కువ ధర వద్ద అపరిమిత డేటాతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించే టెల్కో మరొకటి లేదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ Vi యొక్క అపరిమిత డేటా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కోసం చెల్లించే దానికంటే తక్కువ ధర వద్ద లభించడం. 2021లో ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా తమ యొక్క టారిఫ్‌లను పెంచినప్పటికీ కూడా BSNL టెలికాం ఆపరేటర్ తన టారిఫ్‌లను పెంచకుండా పాత వాటినే కొనసాగిస్తున్నది. 4G నెట్‌వర్క్ కూడా దేశం మొత్తం మీద త్వరలో అందుబాటులోకి రానున్నడంతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాలు ఎంతమేర ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

BSNL రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

BSNL టెలికాం సంస్థ రూ. 400 లోపు ధరతో రూ.398 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ 30 రోజుల వాలిడిటీ కాలానికి తన యొక్క వినియోగదారులకు నిజమైన అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో FUP డేటా వర్తించదు కావున అపరిమిత డేటాను పొందవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు ఏవీ లేవు. రూ.400 లోపు ధరతో అపరిమిత డేటాను అందిస్తున్న ఏకైక టెల్కో BSNL కావడంతో ఇది మార్కెట్‌లోని ప్రత్యేకమైన ప్లాన్‌లలో ఒకటిగా నిలిచింది. BSNL అందించే ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరిన్ని పుష్కలంగా ఉన్నాయ. అయితే ఈ ప్రభుత్వ టెల్కో ప్రైవేట్ ఆపరేటర్‌ల కంటే వెనుకబడి ఉండటానికి గల ఏకైక కారణం 4G లేకపోవడం.

Google Chromeలో డార్క్ మోడ్‌ని ఆన్ చేయడం ఎలా?Google Chromeలో డార్క్ మోడ్‌ని ఆన్ చేయడం ఎలా?

4G నెట్‌వర్క్‌

BSNL టెల్కో 2022 చివరి నాటికి 4G నెట్‌వర్క్‌లను విస్తృత స్థాయిలో ప్రారంభించాలని చూస్తోంది. 2023లో BSNL కూడా స్వదేశీ గేర్‌ల ద్వారా 5Gని ప్రారంభించాలని యోచిస్తోంది. ఇదే కనుక జరిగితే అతి త్వరలో స్వదేశీ నెట్‌వర్క్ ద్వారా 4G సేవలను అందించే ఏకైక టెల్కోగా BSNL అవతరిస్తుంది. అంతేకాకుండా BSNL కి ఇది ఒక పెద్ద అచీవ్‌మెంట్ కూడా అవుతుంది. 4G మరియు 5G అందుబాటులోకి వస్తే కనుక ప్రైవేట్ టెల్కోలందరికి కూడా గడ్డు కాలం మొదలు అయినట్లే.

టెలిగ్రామ్ పెయిడ్ ప్రీమియం వెర్షన్! కొత్త సర్వీసులు & ఫీచర్లు ఇవే...టెలిగ్రామ్ పెయిడ్ ప్రీమియం వెర్షన్! కొత్త సర్వీసులు & ఫీచర్లు ఇవే...

5G నెట్‌వర్క్

5G నెట్‌వర్క్ విషయంలో రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ టెలికాం సంస్థలు కూడా స్వదేశీ పరిష్కారాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. కానీ ప్రైవేట్ టెల్కోలు ఏవీ కూడా ఇప్పటివరకు స్వదేశీ 4G టెక్నాలిజీని ప్రయత్నించలేదు. 4G నెట్‌వర్క్ రాబోయే సంవత్సరాల్లో అందుబాటులోకి రానున్నది కాబట్టి BSNL తిరిగి బౌన్స్ అవ్వడమే కాకుండా భారతీయ టెలికాం మార్కెట్‌లో దాని క్యాలిబర్‌ని చూపించే అవకాశం కూడా ఉంది. మీరు నివసించే ప్రాంతంలో BSNL యొక్క నెట్‌వర్క్ కవరేజీ మంచిగా లభిస్తే కనుక అటువంటి వినియోగదారుల కోసం దీనిని కొనుగోలు చేయడం మరింత విలువైనది.

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వినియోగదారులు మీ యొక్క సెకండరీ సిమ్ కోసం బడ్జెట్‌ను అదుపులో ఉంచుకుంటూ బడ్జెట్ ధరలో లభించే ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు BSNL యొక్క STV_49 ప్లాన్ ఒక గొప్ప ఎంపిక. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 1GB డేటా మరియు 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను 20 రోజుల చెల్లుబాటు కాలానిక పొందుతారు. ఇది భారీ డేటా ప్లాన్ కాదు కానీ తమ సెకండరీ సిమ్ ను ఎప్పటికి యాక్టీవ్ లో ఉంచాలనుకునే వ్యక్తులకు సరైన ఎంపిక అవుతుంది. బడ్జెట్ ధరలో అధిక మొత్తంలో డేటా కోసం చూస్తున్న వినియోగదారుల కోసం BSNL టెల్కో STV_87 మరొక ప్లాన్ ని అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజుకు మరియు 1GB రోజువారీ డేటా ప్రయోజనాలను 14 రోజుల సర్వీస్ వాలిడిటీ కాలానికి పొందుతారు. FUP డేటా వినియోగం పూర్తి అయిన తరువాత డేటా స్పీడ్ 40 Kbpsకి తగ్గుతుంది.

Best Mobiles in India

English summary
BSNL Offers Truly Unlimited Data on These Prepaid Plan: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X