బీఎస్ఎన్ఎల్ రూ.399 ఆఫర్, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Posted By: BOMMU SIVANJANEYULU

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.399 ధర ట్యాగ్‌తో లభ్యమయ్యే ఈ మంత్లీ ప్లాన్‌లో భాగంగా 30జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌ను కొత్తగా జాయిన్ అయ్యే బీఎస్ఎన్ఎల్ కస్టమర్‌లతో పాటు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న పాత యూజర్లు కూడా వినియోగించుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్ మార్చి 1 నుంచి పాన్ ఇండియా అంతటా లభ్యమవుతోంది. మరోవైపు నెట్‌వర్క్ మోడ్రనైజేషన్ అగ్రిమెంట్ పై నోకియా, బీఎస్ఎన్ఎల్‌లు సంతకాలు చేసాయి. 

Snapdragon 845 SoCతో షియోమి నుంచి తొలి స్మార్ట్‌ఫోన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా సపోర్ట్‌

ఈ ఒప్పందంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ 4జీ ఇంకా వాయిస్ ఓవర్ ఎల్టీఈ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన టెక్నికల్ సపోర్ట్‌ను నోకియా సమకూరుస్తుంది. ఈ ప్రాసెస్‌లో భాగంగా వినియోగించే నోకియా సింగిల్ రేడియో యాక్సిస్ నెట్‌వర్క్ (ఆర్ఏఎన్) సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్ ఇన్‌స్టాలేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ, 4జీ సబ్‌‌స్ర్కైబర్లు సింగిల్ రేడియో యూనిట్ క్రిందకు వస్తారు.

బీఎస్ఎన్ఎల్ 4జీ యూజర్లకు హెచ్‌డి క్వాలిటీలో వాయిస్ కాల్స్...

VoLTE సర్వీసులు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా బీఎస్ఎన్ఎల్ 4జీ యూజర్లు హెచ్‌డి క్వాలిటీలో వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది. మహారాష్ట్రా, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ సర్కిళ్లలో తొలత ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తారు.

మార్చి 2018 నాటికి..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో 4జీ సేవల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తుది నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. మార్చి 2018 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని సంస్థ సీనియర్ అధికారి ఒకరు అప్పట్లో మీడియాకు తెలిపారు.

దేశవ్యాప్తంగా 10,000 4జీ సైట్‌లు

4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో 1,150 4జీ సైట్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు టెండర్ ఫర్మాలిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయిని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రాజెక్ట్ నిమిత్తం పాన్ ఇండియా మొత్తం మీద 10,000 4జీ సైట్‌లను ప్లాన్ చేయటం జరిగిది. వాటిలో తెలంగాణకు 550, ఆంధ్రప్రదేశ్‌కు 600 సైట్‌లను కేటాయించటం జరిగిందని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ పి. సుధాకర్ రావు తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL offers unlimited calling plan with 30 GB data per month at Rs. 399 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot