బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్

వెల్‌కమ్ ఆఫర్‌కు కొనసాగింపుగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను రిలయన్స్ జియో అనౌన్స్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు స్పీడ్ లిమిట్‌తో సంబంధం లేకుండా 3జీ డేటాను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు.

Read More : మార్కెట్లో లాంచ్ అయిన 25 కొత్త ఫోన్‌లు ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

STV రూ.498

బీఎస్ఎన్ఎల్ కొత్త డేటా ప్లాన్‌లో భాగంగా రూ.498 పెట్టి రీఛార్జ్ చేయించుకున్నట్లయితే 14 రోజుల పాటు అపరిమితంగా 3జీ డేటాను పొందవచ్చు. గతంలోనూ STV 1099 పేరుతో ఇలాంటి ఆఫర్‌నే బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా 30 రోజుల పాటు స్పీడ్ లిమిట్‌తో పనిలేకుంగా 3జీ ఇంటర్నెట్‌ను పొందే అవకాశాన్ని కల్పించారు.

జియో vs బీఎస్ఎన్ఎల్

జియో అనౌన్స్ చేసిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌‌లో భాగంగా మార్చి 31, 2017 వరకు జియో ఆఫర్ చేసే సేవలను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ ఆఫర్ పిరియడ్‌లో జియో యూజర్లు రోజుకు 1జీబి 4జీ డేటాను మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోగలుగుతారు. 1జీబి లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 128కేబీపీఎస్‌కు పడిపోతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉచిత వాయిస్ కాలింగ్..

జియోకు పోటీగా 2017 నుంచి ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా..

బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్స్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటాయట. ప్రస్తుతం తాము జియో పనితీరును పూర్తిగా పరిశీలన చేస్తున్నామని, జియో తరహాలోనే 2017 నుంచి అత్తి తక్కువ ధరల్లోనే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్‌ను వినియోగదారులకు చేరువ చేస్తామని ఆయన చెప్పారు.

 

 

రూ.2కే రోజంతా..?

జియో కంటే తక్కువ రేట్లకు ఉచిత వాయిస్ కాల్స్ అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం ఈ టారిఫ్ ప్లాన్స్ విలువ రూ.2 నుంచి రూ.4 మధ్య ఉండొచ్చు.

 

 

బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో పట్టు కోసం..

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ విభాగంలో పట్టు సాధించేందుకు బీఎస్ఎన్ఎల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా తన కస్టమర్ బేస్‌ను మరింతగా పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ మునుపెన్నడూ అందుబాటులోని సరికొత్త అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌తో ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Offers Unlimited Data With No Data or Speed Limit To Combat Rivals. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot