సంచలనం రేపుతోన్న బీఎస్ఎన్ఎల్ రూ.144 ఆఫర్

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.144 రేంజ్‌లో సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. 6 నెలలు పాటు అందుబాటులో ఉండే ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ నెలకు రూ.144 చెల్లించటం ద్వారా దేశంలో ఏ నెట్‌వర్క్ అయినా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సంచలనం రేపుతోన్న  బీఎస్ఎన్ఎల్  రూ.144 ఆఫర్

ఈ ప్లాన్‌లో భాగంగా నెల మొత్తం మీద 300 ఎంబి వరకు ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న ప్రీపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఈ ప్లాన్  అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అలానే మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

సంచలనం రేపుతోన్న  బీఎస్ఎన్ఎల్  రూ.144 ఆఫర్

జియో దెబ్బకి టెలికం కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ ,వొడాఫోన్ అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరి బాటలో ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

సంచలనం రేపుతోన్న  బీఎస్ఎన్ఎల్  రూ.144 ఆఫర్

రూ. 99తో రీ ఛార్జ్ చేసుకుంటే నెలరోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్ అలాగే బీఎస్ఎన్ఎల్ టూ బిఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఇది ప్రీపెయిడ్ కష్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. నెలరోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్యాక్ లో మీకు అదనంగా 300 ఎంబీ 3జీ డేటా కూడా లభిస్తుంది. అది ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

English summary
BSNL offers unlimited local and STD calls for Rs144. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot